అవును ఎన్నికలకు ముందునుండి ఉన్న ఇదే ప్రచారం తొందరలో వాస్తవం కాబోతున్నట్లు సమాచారం. ఎందుకంటే మాజీ మంత్రి, పర్చూరులో వైసిపి ఎంఎల్ఏగా పోటీ చేసిన పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. పురంధేశ్వరి కోసం వైసిపి పార్టీ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని దగ్గుబాటి చెప్పటంలోనే విషయం అర్ధమైపోతోంది.

 

యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉంటున్న దగ్గుబాటి ఎప్పుడైతే వైసిపిలో చేరారో అప్పుడు అర్ధమైపోయింది అందిరకీ బిజెపి నేత పురంధేశ్వరి కూడా వైసిపిలోకి వచ్చేస్తారని. కాకపోతే ఎన్నికలకు ముందు పార్టీ మారటం బావోదని అనుకున్నారట. అందుకనే కొడుకు చెంచురామ్ కోసమని ముందుగా దగ్గుబాటి వైసిపిలో చేరారు. కానీ సాంకేతిక కారణాల వల్ల కొడుకు ఎన్నికల్లో పోటీ చేయటానికి అవకాశం లేకపోయింది. దాంతో చివరి నిముషంలో దగ్గుబాటే రంగంలోకి దిగారు.

 

అదే విషయాన్ని దగ్గుబాటి చెబుతూ పురంధేశ్వరి చేరాలని అనుకుంటే వైసిపిలోకి ఎప్పుడైనా రావచ్చన్నారు.  రాష్ట్రంలో బిజెపికి పెద్దగా భవిష్యత్తు కూడా లేదని అభిప్రాయపడ్డారు. తొందరలోనే అంటే ఎన్నికల ఫలితాల తర్వాత పురంధేశ్వరి ఏదో ఓ నిర్ణయం తీసుకోవచ్చనే అర్ధం వచ్చేట్లుగా చెప్పారు.

 

కాబట్టి అందరూ ఊహించినట్లుగానే తొందరలో పురంధేశ్వరి వైసిపి ఎంట్రీ జరుగుతుందని అనుకుంటున్నారు. కేంద్రంలో ఎన్డీఏ నే మళ్ళీ అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో వైసిపి గనుక అధికారంలోకి వస్తే పురంధేశ్వరి బిజెపిలో ఉన్నా ఒకటే వైసిపిలో ఉన్నా ఒకటే.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: