దేశంలో ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్న క్రమంలో జాతీయ పార్టీల నాయకులు కచ్చితంగా ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని ఎలాగైనా ఎర్రకోటపై అధికార పీఠం వేసుకుని కూర్చోవాలని అందివచ్చిన ప్రతి అవకాశాన్ని పుచ్చుకుంటూ ముందుకు సాగుతున్నారు.

Image result for akhilesh yadav MODI

ఈ క్రమంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు తమ ప్రత్యర్థి పార్టీలపై చేస్తున్న కామెంట్ల విషయంలో జాతీయ స్థాయి నేతలు సోషల్ మీడియాలో బహిరంగంగా చాలా దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల  ప్రదానమంత్రి నరేంద్ర మోడీపై సమాజవాది పార్టీ అదినేత అఖిలేష్ యాదవ్ తీవ్ర వ్యాఖ్య చేశారు.

Image result for akhilesh yadav MODI

నలభై మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని అన్నందుకుగాను మోడీని డెబ్బై రెండు ఏళ్ల పాటు నిషేధించాలని ఫైర్ అయ్యారు. 125 కోట్ల దేశ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ప్రధాని ఇప్పుడు 40 మంది ఎమ్మెల్యేల అనైతిక ఫిరాయింపులపై ఆధారపడ్డారా అని ప్రశ్నించారు.ఈ వ్యాఖ్య మోడీ బ్లాక్ మెయిల్ మనస్తత్వానికి అద్దం పడుతుందని , ఎన్నికల కమిషన్ చేస్తున్నట్లుగా 72 గంటలు కాకుండా మోడీపై 72 ఏళ్ల పాటు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా నిషేధం పెట్టాలని అఖిలేష్ ట్విటర్ లో పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: