గుంటూరు జిల్లాలోని వేమూరులో పోటీ చేసిన మంత్రి నక్కా ఆనందబాబు ఓటమి ఖాయమని చంద్రబాబునాయుడుకు మద్దతుగా నిలబడే మీడియా తేల్చేసినట్లే అనిపిస్తోంది. మొన్నటి వరకూ నక్కా గెలుపోటములపై ఎవరికైనా సందిగ్దంగా ఉంటే మీడియాలో వచ్చిన కథనం చదివిన తర్వాత ఓటమి ఖాయమే అని అనిపిస్తే అది చదివిన వారి తప్పు కాదు.

 

వేమూరులో రిటైర్డ్ తహసిల్డార్ వెంకటేశ్వరరెడ్డి అనధికారంగా ఎన్నికల విధులు నిర్వహించారట. వెంకటేశ్వరరెడ్డి రాజన్న రాజ్యం కోసం పేరుతో ఫేస్ బుక్ లో ఓ ప్రొఫైల్ క్రియేట్ చేశారట. వేమూరులో జేసి-2 ఆర్ వోగా ఉన్న వెంకటేశ్వరరెడ్డి వైసిపి తరపున అన్నీ తానై వ్యవహరించారట.

 

ఇక్కడే అందిరికీ వెంకటేశ్వరరెడ్డి వ్యవహార శైలిపై అనుమానాలు వచ్చాయట. దాంతో తన ఓటమికి కుట్ర జరిగిందని నక్కా ఆనందబాబు గోల మొదలుపెట్టారు. అసలు సదరు మీడియా ఇచ్చిన కథనమే గందరగోళంగా ఉంది. ఒకసారేమో వెంకటేశ్వరరెడ్డి రిటైర్డ్ తహసీల్దార్ అని చెప్పింది. మరోసారేమో జెసి 2 ఆర్వో  అని చెప్పింది.

 

పైగా అనధికారికంగా ఎన్నికల విధులు నిర్వహించారని ఆరోపించింది. జేసి-2 ఆర్వో అంటేనే అధికారికం కదా. మరి అనధికారికంగా ఎన్నికల విధులు నిర్వహించారని చెప్పటమేంటో అర్ధం కావటం లేదు. ఎవరైనా అనధికారికంగా విధులు ఎలా నిర్వర్తించగలరా ? పైగా వైసిపి సానుభూతిపరుడని చెబుతున్నపుడు జిల్లా యంత్రాంగం దృష్టిలో ఆ విషయం పడకుండానే ఉంటుందా ?

 

వైసిపి సానుభూతిపరుడు ఎన్నికల విధులు నిర్వహించటం పట్ల టిడిపి శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని చెబుతోంది. వెంకటేశ్వరరెడ్డి వైసిపి సానుభూతిపరుడైతే రాష్ట్రంలో కొన్ని వేలమంది టిడిపి సానుభూతిపరులున్నారు. ఎంతోమంది పోలీసు అధికారులు, రెవెన్యు అధికారులు టిడిపికి మద్దతుదారులుగా ఉన్నారని వైసిపి ఆరోపిస్తోంది. మరి వారందరూ ఎన్నికల్లో విధులు నిర్వహించలేదా ? పైగా తన ఓటమికి కుట్ర జరిగిందని మంత్రి ఫిర్యాదు చేయటమేంటో అర్ధం కావటం లేదు. అంటే నక్కా ఆనందబాబు ఓటమి ఖాయమని సదరు మీడియా చెప్పదలచుకున్నదా ?


మరింత సమాచారం తెలుసుకోండి: