కమలనాథులు గత పది రోజులుగా ప్రచారంలో స్పీడ్ పెంచారు... అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రజల్లో ప్రచారంగా మలిచి ఎన్నికల్లో లబ్ది పొందడానికి ప్రయత్నిస్తున్నారు... ఈ క్రమంలో ప్రధాని మోడీ పరిధి దాటుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా రాజకీయాల్లో కుల ప్రస్తావన తగదనే గతంలో సెలవిచ్చిన ప్రధాని.. తాను బీసీనంటూ తన కులాన్ని ప్రస్తావించడాన్ని ఏమనుకోవాలి.... అలాగే బాలాకోట్ వీరులకు ఓటేస్తారో... పాకిస్తాన్ టెర్రరిస్టులకు ఓటేస్తారో అంటూ చివరికి దేశ రక్షణలో అసువులు బాసిన ఆర్మీ జవాన్లును సైతం ఆయన ప్రచారంలో వాడుకున్నారు. 


అంతటితో ఆగకుండా పరిధిని దాటి... మరీ.. 40 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు... మీ ప్రభుత్వం కూలిపోతుందనే అర్థం వచ్చేలా బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ఉద్దేశించి  ఆయన చేసిన వ్యాఖ్యలు... ఇప్పుడు దేశ వ్యాప్త సంచలనమయ్యాయి... అంటే ప్రధాని కూడా బేరసారాలాడుతున్నారా అన్న ప్రశ్న విపక్షాల నుంచి మొదలైంది.


ప్రధాని స్థాయిలో ఉండి ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటే ఏమనుకోవాలనే ప్రశ్న బలంగా బయలుదేరింది.. ఇది ఖచ్చితంగా బేరసారాలకు దిగడమేనని ఈసీకి ఫిర్యాదు చేయడానికి విపక్షాలు సిద్దమవుతున్నాయి... అలాగే మరో బీజెపి నేత, యూపీ సీఎం అలీ కావాలా భజరంగ భళి కావాలాంటూ చేసిన వ్యాఖ్యతో ఈసీ ఆయన ప్రచారంలో మూడు రోజుల నిషేధం విధించింది.. ఒకటి మాత్రం నిజంగా మనం ఏం మాట్లాడిన మన స్థాయి మరిచి మాట్లాడుతున్నామే లేదో చూసుకోవాలి... ప్రధాని స్థాయి వ్యక్తులు ఇలా మాట్లాడితే ఖచ్చితంగా చర్చ కాకుండా ఎలా ఉంటుంది... 


మరింత సమాచారం తెలుసుకోండి: