ఏపీలో అధికార మార్పిడి ఉంటుందని ఓ వైపు సర్వేలు వూదరగొడుతున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ కంటే వైసీపీ బాగా కష్టపడిందని, కసిగా పనిచేసిందని అంటున్నారు. ఆ కష్టానికి ప్రతిఫలమే ఇపుడు ఓట్లు, సీట్ల రూపంలో అందుతోందని కూడా చెబుతున్నారు. ఈసారి టీడీపీ వ్యూహాలను అన్నింటినీ చేదించి మరీ వైసీపీ ముందుకు దూసుకుపోయిందని కూడా చెబుతున్నారు.


దాంతో జగన్ సీఎం అవుతారని అంతా అనుకుంటున్నారు. ఐతే ఏపీలోని ఐఏఎస్ ఐపీఎస్ వర్గాల్లో మాత్రం జగన్ సీఎం అన్న దాని మీద రెండుగా చీలిపోయారని అంటున్నారు. చంద్రబాబు మళ్ళీ రావాలని కోరుకుంటున్న వర్గం ఓ వైపు, జగన్ సీఎమ్ గా  రావాలని మరో వర్గంగా చీలిపోయిందని చెబుతున్నారు. జగన్ వస్తే తమకు ప్రమోషన్లు, అన్ని రకాలుగా ప్రాధ్యాన్యత ఉంటుందని జగన్  అనుకూల వర్గం భావిస్తోంది.


అదే సమయంలో జగన్ వస్తే తమకు శంకరగిరి మాన్యాలు తప్పవని మరో వర్గం ఆందోళన పడుతోందట. అందువల్ల జగన్ రావద్దు అంటోంది ఆ వర్గం. ఇక ఆ వర్గం చంద్రబాబు  గెలుపు కోసం బాగా కష్టపడినట్లుగా కూడా చెబుతున్నారు. పసుపు కుంకుమ మళ్ళీ బాబుని గెలిపిస్తాయని కూడా ఆ వర్గం ధీమాగా చెబుతోందట. మొత్తం మీద చూసుకుంటే జగన్ సీఎం అంటూ ఏపీలోని ఉన్నతాధికారుల వర్గాలు రెండుగా విడిపోవడం మాత్రం షాకింగ్ పరిణామమే.


మరింత సమాచారం తెలుసుకోండి: