ఇపుడు ఏపీలోనే కాదు, జాతీయంగాను బాగా నానుతున్న పేరు జగన్ దే. ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నాయి. అంతే కాదు, ఆయన పార్టీకు పెద్ద ఎత్తున ఎంపీలు కూడా వస్తారని కూడా లెక్కలు వేస్తున్నారు. దాంతో జగన్ అంటున్నారంతా. జగన్ ఉంటే చాలు, కొండంత బలం అనుకుంటున్నారుట.


నాలుగు దశల  సార్వత్రిక ఎన్నికలు దేశంలో ముగిసిపోయాయి. ఇక మిగిలింది మూడు దశల ఎన్నికలు మాత్రమే. ఈ నాలుగు దశలలోనూ నూ దేశంలో జాతీయ పార్టీ, అధికారంలో ఉన్న బీజేపీ ఎక్కడా స్పీడ్ చూపించలేకపోయిందని పోలింగ్ సరళి చెప్పేస్తోంది. గత ఎన్నికల్లో మొదటి నాలుగు దశల్లోనే 160కి పైగా ఎంపీ సీట్లను బీజేపీ కైవశం చేసుకుంది. ఇపుడు ఆ పరిస్థితి లేదు. దాంతో కమలనాధులు కంగారు పడుతున్నారుట.


ఈ నేపధ్యంలో ఎక్కువ సీట్లు వచ్చిన ప్రాంతీయ పార్టీలను మచ్చిక చేసుకునే పనిలో బీజేపీ పడినట్లుగా సమాచారం. జగన్ తో బీజేపీ పెద్ద తలకాయలు తెర వెనక చర్చలకు రెడీ అయ్యారని కూడా తెలుస్తోంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో ప్రముఖ నాయకులు జగన్ తో టచ్ లో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఏపీలో పాతిక ఎంపీ సీట్లు ఉన్నాయి.అందులో కనీసంగా 16 నుంచి 19 వరకూ ఎంపీలు ఇపుడు వైసీపీ ఖాతాలో పడతాయని సర్వేలు చెబుతున్నాయి.


దాంతో జగన్ని మచ్చిక చేసుకుంటే కొత్త సర్కార్ ఏర్పాటులో ఇబ్బందులు ఉండవని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లుగా డిల్లీ సర్కిల్స్ లో న్యూస్ వైరల్ అవుతోంది. అయితే జగన్  వైసీపీ మద్దతుకు ప్రత్యేక హోదాతో పాటు ఎక్కువ మందికి మంత్రి పదవులు, ఏపీని ఆర్ధికంగా ఆదుకోవడం వంటి షరతులు బీజేపీకి విధించారని చెబుతున్నారు. మరి చూడాలి ఈ పోస్ట్ పోల్ బంధం ఎలా మొదలవుతుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: