మొత్తానికి చంద్రబాబునాయుడు కోరిక తీరింది.  సమీక్షలో అంటూ గోల పెట్టుస్తున్న చంద్రబాబు మొత్తానికి గురువారం నాడు సమీక్ష చేశారు. ఫణి తుపాను ప్రభావంపై ఉన్నతాధికారులతో సమీక్షించి అవసరమైన ఆదేశాలను జారీ చేశారు. ఉదయమే ఆర్టీజిఎస్ కార్యాలయంకు చేరుకున్న చంద్రబాబు వెంటనే సమీక్ష మొదలుపెట్టారు.

 

శ్రీకాకుళం జిల్లాలోని ఉత్ధానం మండలంలోని 15 మండలాల్లోని 200 గ్రామాలపై తుపాను ప్రభావం బాగా ఉంటుందని ఉన్నతాధికారులు చెప్పారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సుమారు 1500 క్యాంపులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పాలు, తాగునీటి అవసరాలకు ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు ఆదేశించారు.

 

మొత్తానికి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా సమీక్షలో అంటూ ఒకటే గోల చేస్తున్న విషయం తెలిసిందే. పోలింగ్ అయిన తర్వాత రెండు రోజుల పాటు బలవంతంగా అధికారులను సమీక్షలను పిలిపించుకున్నారు. ఈ విషయమై ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంను ఎలక్షన్ కమీషన్ హెచ్చరించింది. దాంతో ఎల్వీ శాఖాధిపతులకందరికీ నోటీసులు జారీ చేశారు.

 

అప్పటి నుండి చంద్రబాబు సమీక్షలంటేనే అధికారులు భయపడిపోయారు.  చివరకు సమీక్షలని చంద్రబాబు కబురు చేసినా ఎవరూ హాజరుకాలేదు. అప్పటి నుండి సమీక్షల కోసం చంద్రబాబు ప్రతీరోజూ గోల చేస్తూనే ఉన్నారు. ఇదే విషయమై కేంద్ర ఎన్నికల కమీషన్ కు లేఖ కూడా రాశారు. తెర వెనుక ఏమైందో తెలీదు కానీ విపత్తు నిర్వహణ శాఖ, ఆర్టీజీఎస్ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపి తన కోరికను తీర్చుకున్నారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: