తెలుగుదేశంపార్టీలో ఏం జరుగుతోందో ఎవరికీ అర్ధం కావటం లేదు. అంతా అయోమయం అంతా గందరగోళంగా ఉంది పరిస్ధితి.  అధికారంలోకి  రాబోయేది మళ్ళీ టిడిపినే అని పదే పదే చంద్రబాబునాయుడు చెబుతున్నా చాలామంది అభ్యర్ధులు, నేతల్లో ఏమాత్రం నమ్మకం కనిపించటం లేదు. దాంతో ఫలితాల తర్వాత పలానా అభ్యర్ధి వైసిపిలోకి వెళిపోతాడని, ఫలానా ఎంపి అభ్యర్ధి వైసిపి నేతలతో టచ్ లో ఉన్నడనే ప్రచారం రోజు రోజుకు పెరిగిపోతోంది. అందుకనే అభ్యర్ధులపై నిఘా ఉంచారని సమాచారం.

 

చంద్రబాబు ఓ పట్టాన ఎవరినీ నమ్మడన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకనే ప్రతీ విషయంలోను ఒకటికి ఇద్దరు, ముగ్గురు నేతలను చెక్ చేసుకుంటుంటారు.  ఎన్టీయార్ ను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రయ్యారు కదా ? అందుకే చంద్రబాబులో అభ్రదత పేరుకుపోయింది.

 

దానికి తోడు మొన్నటి ఎన్నికల్లో చాలామంది అభ్యర్ధులకు ఇష్టం లేకపోయినా టికెట్లు ఇవ్వాల్సొచ్చింది. ఒకరకంగా ఎంఎల్ఏ అభ్యర్ధులు చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి మరీ టికెట్లు సాధించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు ముందు ఎవరినైతే చంద్రబాబు ఓడిపోతారని సర్వేల్లో తేలిందని చెప్పారో వారిలో చాలామందికి మళ్ళీ టికెట్లు దక్కటంతో ప్రచారానికి ఊపొచ్చింది.

 

పోలింగ్ రోజు చంద్రబాబు చేసిన గోలతో అధికారంలోకి రాబోయేది వైసిపినే అనే ప్రచారం ఒక్కసారిగా పెరిగిపోయింది. దాంతో టిడిపిలో నైరాస్యం పెరిగిపోయింది.  దాంతో టిడిపిలో గెలిచే అభ్యర్ధుల్లో చాలామంది వైసిపి నేతలతో టచ్ లో ఉన్నారంటూ ప్రచారం పెరిగిపోతోంది. వైసిపి అధికారంలోకి వస్తే గోడ దూకేయటానికి చాలామంది రెడీగా ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారంతో గందరగోళం మొదలైంది. అందుకనే అభ్యర్ధుల పై నిఘా పెట్టారంటూ ప్రచారం మొదలైంది.

 

మళ్ళీ నిఘా కూడా రెండు రకాలట. మొదటిదేమో ఇంటెలిజెన్స్ పోలీసులదైతే రెండోదేమో పార్టీ పరంగా నిఘానట. పార్టీ పరంగా వందలాదిమంది నేతలున్నారు కాబట్టి అభ్యర్ధుల కదలికలపై సమాచారం తెచ్చుకోవటం చంద్రబాబుకు పెద్ద సమస్యేమీ కాదు. ఇంటెలిజెన్స్ అయినా పార్టీ నేతలైనా గోడ దూకదలుచుకున్న వారిని ఎవ్వరూ ఆపలేరనుకోండి అది వేరే సంగతి.  పోయిన ఎన్నికల్లో వైసిపి తరపున గెలిచి టిడిపిలోకి ఫిరాయించిన ఎంపిలు, ఎంఎల్ఏల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేయగలిగారు ?

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: