రాజకీయల్లో వ్యూహాలు ఈనాటివి కావు, క్రీస్తు పూర్వం రోజుల్లో చాణక్యుడు వీటికి ఆధ్యుడు. అంటే అతి ప్రాచీనమైనది వ్యూహ రచన అన్న మాట. ప్రత్యర్ధులను చిత్తు చేసేందుకు వేసేందుకు ఎన్నో ఎత్తులు ఉంటాయి. అసలు నకిలీ తేడా తెలియకుండా భ్రమింపచేయడం. మనిషిని, మనసును వేరు చేయడం తనకు తానే ఓడిపోయే విధంగా చేయడం ఇదంతా మైండ్ గేమ్ లో భాగమే. ఆధునిక రాజకీయాల్లో దీనికి ఇపుడు ఎంతో ఇంపార్టెన్స్ ఉంది.


ఏపీలో మైండ్ గేమ్ విషయంలో చంద్రబాబు సిధ్ధహస్తుడు. ఆయన గురించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పినట్లుగా బాబు పోరాటయోధుడు. అఖరి నిముషం వరకూ ఆయన ఓటమిని అంగీకరించరు. ఓటమి అంచుల నుంచి కూడా గెలుపు పిలుపుని వింటారు. అటువంటి రాజకీయ దురంధరుడు చంద్రబాబు ఇపుడు ఏపీలో సరికొత్త మైండ్ గేమ్ కి తెర లేపారు. ఏపీలో వచ్చేది టీడీపీ సర్కారేనని బాబు పదే పదే అంటున్నారు. రోజుకు నాలుగు సార్లు అంటున్నారు.


దానికి ఆయన తన నలభయ్యేళ్ల అనుభవాన్ని కూడా వాడుకుంటున్నారు. మరి బాబు చెప్పినట్లుగా టీడీపీ గెలుస్తుందా లేక మైండ్ గేమ్ మే 23 వరకే సాగి ఆగుతుందా అన్నది చూడాలి. మరో వైపు చూసుకుంటే వైసీపీలోనూ మైండ్ గేమ్  పోలింగ్ తరువాత కొన్ని రోజుల వరకూ నడించింది. మేమే గెలుస్తున్నామని మొదట జగన్ అంటే ఆ తరువాత ఆ పార్టీ నాయకులు 120 సీట్లు అంటూ నంబర్ చెప్పి మరీ రచ్చ రచ్చ  చేశారు. అయితే గత కొద్ది రోజులుగా వైసీపీ నుండి సౌండ్ మెల్లగా తగ్గిపోతోంది.


అదే టైంలో మొదట్లో ఈవీఎంలను తిట్టిపోసిన చంద్రబాబు ఇపుడు మేమే గెలుస్తున్నామంటూ పాట పాడుతున్నారు. మరి దీన్ని బట్టి చూస్తే ఎవరు విజేత, ఎవరు పరాజితులు అన్నది పెద్ద డౌట్ గా ఉంది. వైసీపీ తగ్గిపోవడం, టీడీపీ ఒక్కసారిగా గొంతు పెంచడం దేనికి సంకేతమని కూడా చర్చ సాగుతోంది. నిజానికి ఈ మైండ్ గేమ్ సంగతి  పక్కన పెడితే ఏప్రిల్ 11న ఈవీఎంలలో పడిన ఓట్లు  నిక్షేపంలా అలాగే ఉన్నాయి. అవి నోరు తెరిస్తే ఈ మైండ్ గేమ్ లనీ ఒక్కసారిగా  స్టాప్ అయిపోతాయి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: