జైషే మ‌హ్మ‌ద్ ఉగ్ర‌సంస్థ అధినేత మ‌సూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదేనని ఐక్యరాజ్యసమితి ప్రకటించిన నేపథ్యంలో పాకిస్థాన్ అతనిపై చ‌ర్య‌లకు దిగింది. నిబంధ‌న‌ల ప్ర‌కారం అత‌డి ఆస్తుల జ‌ప్తుకు ఆదేశించింది పాక్ ప్ర‌భుత్వం. అతను ఎలాంటి ఆయుధాలు కొనుగోలు, అమ్మ‌కాలు జ‌ర‌ప‌రాద‌ని ఆంక్ష‌లు విధిస్తూ.. అధికారిక నోటిఫికేష‌న్ కూడా విడుద‌ల చేసింది పాక్ ప్ర‌భుత్వం. 


నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా మ‌సూద్‌పై చ‌ర్య‌లు తీసుకుంటామంటూ విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్‌లో పాక్ ప్ర‌భుత్వం పేర్కొంది. మ‌సూద్‌పై విదేశీ ప్ర‌యాణాల‌పై కూడా పాక్ నిషేధం విధించింది. అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదిగా మ‌సూద్‌ను ప్ర‌క‌టిస్తూ మండ‌లి తీసుకున్న నిర్ణ‌యాన్ని తాము మ‌న‌స్ఫూర్తిగా అంగీక‌రిస్తున్న‌ట్లు పాక్ ప్ర‌క‌టించింది. అయితే అతడిపై వెంటనే ఆంక్షలను అమలుచేస్తామని ఆ దేశ విదేశాంగశాఖ వెల్లడించిన విషయం తెలిసిందే.


 అంత‌కుముందు పుల్వామా ఉగ్ర‌వాద దాడిని మ‌సూద్ ముడిపెట్ట‌డంలాంటి రాజ‌కీయ ప్ర‌స్తావ‌న‌ల‌ను తొల‌గించిన త‌ర్వాతే ఐక్య‌రాజ్య‌స‌మితీ తీర్మానానికి ఓప్పుకున్న‌ట్లు అందులో పేర్కొంది పాక్‌.  మసూద్ ను ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ గా ప్రకటించాల్సిందేనంటూ అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ తదితర దేశాలు భద్రతా మండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి.ఆ త‌ర్వాత‌ చైనా కూడా ఇందుకు అభ్యంతరం తెలపకపలేదు. దీంతో రెండు రోజుల క్రితం మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తూ నిర్ణయం వెలువడింది


మరింత సమాచారం తెలుసుకోండి: