నెల్లూరు జిల్లాలో సీనియర్ నేత, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు గందరగోళంలో పడినట్లేనా ? జిల్లాలో ఇపుడిదే అంశంపై తీవ్రమైన చర్చ నడుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేది అనుమానంగానే ఉంది.  పార్టీ  తిరిగి పవర్ లోకి వస్తుందన్న నమ్మకం చంద్రబాబునాయుడు అండ్ కో లోనే కనిపించటం లేదు. ఏదో మేకపోతు గాంభీర్యం ప్రదర్శించటం తప్ప లోలోపల అందరిలోను టెన్షన్ బయటకు కనబడుతునే ఉంది.

 

ఇక విషయానికి వస్తే సోమిరెడ్డి ఒక్కరే మంత్రులందరిలోను ఎగిరెగిరి పడుతున్నారు. సమీక్షలను అడ్డుకుంటోందని ఈసిపైన, వారిని వైసిపి ఆడిస్తోందంటూ జగన్, మోడిపైన నోరు పారేసుకుంటున్నారు.  సోమిరెడ్డి ఒక్కరే ఎందుకు ఇలా నోరు పారేసుకుంటున్నారు ? ఎందుకంటే, వచ్చే ఎన్నికలకు సోమిరెడ్డి రాజకీయ భవిష్యత్తు ఎలాగుంటుందో ఎవరూ చెప్పలేకున్నారు.

 

ఇప్పటికే సోమిరెడ్డి వయస్సు 63. కాబట్టి వచ్చే ఎన్నికల నాటికి పోటీ చేసే అవకాశం ఉండకపోవచ్చు.  ఒకవేళ రేపటి ఎన్నికల్లో టిడిపి ఓడిపోతే సోమిరెడ్డి రాజకీయ భవిష్యత్తు దాదాపు ముగిసినట్లే అనుకోవాలి. ఎలాగంటే ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు కానీ ఎంఎల్సీగా రాజీనామా చేసేశారు. పోయిన ఎన్నికల్లో ఎంఎల్ఏగా ఓడిపోయిన సోమిరెడ్డిని చంద్రబాబు ఎంఎల్సీని చేసి మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

 

ఇప్పటికే నాలుగు వరుస ఎన్నికల్లో ఓడిపోయిన సోమిరెడ్డి ఈ ఎన్నికల్లో కూడా గెలుస్తారన్న నమ్మకం ఎవరిలోను లేదు. ఎంఎల్ఏగా ఓడిపోయి, ఎంఎల్సీకి కూడా రాజీనామా చేసేసి, పార్టీ కూడా ఓడిపోతే సోమిరెడ్డి భవిష్యత్తు అంతే సంగతులు.

 

పార్టీ ఓడిపోయినా గెలిచే ఎంఎల్ఏల సంఖ్యాబలం రీత్యా మళ్ళీ ఎంఎల్సీ అవకాశం చంద్రబాబు ఇవ్వకపోతారా అన్నదే సోమిరెడ్డి ఆలోచనగా చెబుతున్నారు. ఎలాగూ ప్రత్యర్ధులపై ఎలా పడితే అలా నోరుపారేసుకోవటంలో సోమిరెడ్డి ముందుంటారు. రేపు టిడిపి ప్రతిపక్షం సక్రమంగా పనిచేస్తోందని జనాలు అనుకోవాలంటే సోమిరెడ్డి లాంటి వాళ్ళే అవసరం అవుతారేమో చంద్రబాబుకు. మొత్తానికి సోమిరెడ్డి పెద్ద ప్లానే వేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: