తమ కూటమి తరపున ప్రధానమంత్రిగా ఎవరుండాలనే విషయాన్ని ఈనెల 21వ తేదీన నిర్ణయించనున్నట్లు చంద్రబాబునాయుడు తాజాగా సెలవిచ్చారు. క్షేత్రస్ధాయి నుండి అందుతున్న ఫీడ్ బ్యాక్ ప్రకారమైతే సీట్లు తక్కువొచ్చినా మళ్ళీ ఎన్డీఏకే అధికారమని స్పష్టమవుతోంది. ఇలాంటి సమయంలో తమ కూటమి తరపున ప్రధాని ఎవరో నిర్ణయించేస్తామని చంద్రబాబు చెప్పటమంటే పెద్ద జోక్ గానే ఉంది.

 

ఎందుకంటే, నరేంద్రమోడిపై జనాల్లో  వ్యతిరేకత ఉందన్నది వాస్తవం. అయితే ఆ వ్యతిరేకత నుండి లబ్దిపొందే స్ధితిలో యూపిఏ పక్షాలు లేవన్నది అంతే వాస్తవం. యూపిఏ పక్షాల్లో దేనికదే బలమైన పార్టీనే కానీ కూటమిగా చూస్తే మాత్రం బాగా బలహీనమనే చెప్పాలి. ఉత్తర ప్రదేశ్ లో ఎస్పీ, బిఎస్పీ బలమైన పార్టీలే. కానీ రెండు పార్టీలతో కాంగ్రెస్ కు పొత్తులేదు. అందుకనే రెండు పార్టీలు ఒకటిగా కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తోంది. కాబట్టి ఓట్లు చీలటం ఖాయం.

 

అలాగే పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ బలమైన పార్టీనే. కానీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ తో పొత్తులేదు. మహారాష్ట్రంలో శరద పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ బలం పర్వాలేదనేట్లుగా ఉందంతే.  కూటమిలోనే కాంగ్రెస్ తో చాలా పార్టీలకు సఖ్యత లేకపోతే ఇక మోడిని ఢీ కొట్టి ఎలా గెలుస్తాయి ? అదే సమయంలో ప్రధానమంత్రి పదవికి పోటీ పడేవాళ్ళు అరడజనుమందున్నారు.

 

మాయావతి, ములాయం సింగ్ యాదవ్ ఎప్పటి నుండో కన్నేసున్నారు. తాజాగా మమతా బెనర్జీ కూడా పిఎం పోస్టుకు రెడీ అయిపోయారు. అవకాశం వస్తే శరద్ పవార్ మాత్రం కాదంటారా ?  ఎంపి సీట్లు తెచ్చుకుని పిఎం పోస్టుకు బలమైన పోటీదారుగా ఉన్న నేతలను కన్వీన్స్ చేయగల సామర్ధ్యం చంద్రబాబుకు లేదన్నది వాస్తవం. ఎందుకంటే, రేపటి కౌంటింగ్ లో చంద్రబాబు పరిస్ధితేమవుతుందో అయోమయంగా ఉంది. పైగా చంద్రబాబు చెబితే వినేవాళ్ళు ఎవరూ లేరక్కడ. ఒకవేళ పార్టీ ఓడిపోతే కూటమిలో చంద్రబాబును పట్టించుకునే వాళ్ళే ఉండరు.

 

 

వాస్తవాలు ఇలావుండగా చంద్రబాబు మాత్రం ఊహల్లో తేలిపోతున్నారు. ప్రధానమంత్రి అభ్యర్ధిని తానే నిర్ణయిస్తానని, తనంటి సీనియర్ పొలిటీషియన్ దేశంలోనే లేరంటూ సొంత మీడియాలో డబ్బా కొట్టుకోవటానికి తప్ప చంద్రబాబు మాటలు ఇంకెందుకు పనికిరాదన్న విషయం అందరికీ తెలిసిందే. తప్పదు ఇంకో 20 రోజులు చంద్రబాబు ప్రగల్భాలను భరించాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: