ఏపీలో ఇపుడు సీన్ మొత్తం అందరికీ అర్ధమైపోతోంది. ఓ వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు మరో వైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఉన్నారు. సీఎస్ గా అయన తన విధులు తాను చేసుకుంటూ పోతున్నారు. బాబు గారు మాత్రం ఈసీ, మోడీ అంటూ చుట్టు తిరిగి ఇపుడు ఏకంగా సీఎస్ మీదనే గురి పెట్టేశారు. సీఎస్ విషయంలో బాబు సీరియస్ గానే ఉన్నారు. అది ఎటు పరిణమిస్తుందో అన్నదే చూడాలి.


ఇదిలా ఉండగా షాకింగ్ న్యూస్ ఒకటి ఇపుడు వైరల్ అవుతోంది. సీఎస్ సమీక్షలకు హాజరవుతున్న అధికారులు కొందరు టీడీపీకి పెట్ గా వ్యవహరిస్తున్నారుట. రివ్యూ మీటింగులో ఏం జరిగిందో పూస గుచ్చినట్లుగా గుట్టు విప్పి తమ ప్రైవేట్  బాస్ లకు  చెప్పేస్తున్నారుట. ఈ రకంగా ఉప్పు అందించడంతో టీడీపీ విమర్శలకు కొత్త ఆయుధాలు దొరుకుతున్నాయట. ఇక సీఎస్ కీలకమైన  నిర్ణయాలు అన్నీ కూడా ముందే తెలిసిపోతున్నాయట.


అతి ముఖ్యమైన ఫైళ్ళను సీఎస్ చూడకముందే దాని గుట్టూ మట్టూ భాగోతం అంతా ఎక్కడ చేరాలో అక్కడకు  చేరిపోతోందట. దీంతో ఎల్వీ గుస్సా అవుతున్నారని టాక్. తన మీదనే నిఘా పెడతారా అంటూ సీఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా ఎన్నికల అధికారి ద్వివేదీకి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే అయిదేళ్ల బాబు గారి జమానాలో బాగా కలసిపోయిన అధికారులు చాలా మంది పచ్చ పాట పాడుతున్నారుట. సహాయ నిరాకరణ కూడా చేస్తున్నారుట. ఆ విధంగా సీఎస్ పై టీడీపీ పై చేయి సాధిస్తోందని అంటున్నారు. చూడాలి ఈ నిఘా న్యూస్ నిజమైతే మాత్రం వ్యవహారం చాలా పీక్స్ కి చేరిపోయినట్లే మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: