యువత ఎన్నో క‌ల‌లు కంటూ త‌మ క‌ల‌ల‌ను నిజం చేసుకోవాల‌ని త‌ప‌న ప‌డుతూ ఉంటారు. దాని కోసం ఎంత‌టి ప‌ని చేయ‌మ‌న్నా చేస్తేస్తూంటారు. అస‌లు అది మంచా చెడా.. అన్న విష‌యాలు ఒక్క క్ష‌ణం ఆలోచ‌న చేయరు. సినిమాలో నటించాల‌ని కొంద‌రు. పోలీస్ అవ్వాల‌ని మ‌రొకొంద‌రు, సైంటిస్ట్‌, ఇంజినీర్‌, డాక్ట‌ర్‌.. ఇలా ఎన్నో క‌ల‌ల‌తో త‌మ క‌ల‌ల‌ను నిజం చేసుకోనేందుకు జీవిస్తూ.. క‌ష్ట‌ప‌డే వారు కంద‌రైతే.. వాటి పేర్లు చెప్పి అయామ‌కుల‌ను మోసం చేసే వారు మ‌రి కొంద‌రు ఉన్నారు.


ఈ నేప‌థ్యంలో తాజాగా సినిమాల్లో నటించాల‌న్న కోరిక‌తో ముంబైకి వెళ్లి డ్ర‌గ్స్ స్మ‌గ్ల‌ర్‌గా మారాడు హైద‌రాబాద్ వాసి. పాతబ‌స్తికి చెందిన ఓ యువ‌కుడికి సినిమాలంటే పిచ్చి.. ఆ పిచ్చితో మొంబై వెళ్లాడు. కానీ డ్రైగ్స్ ముఠాతో జ‌త క‌ట్టి స్మ‌గ్ల‌ర్‌గా మారాడు. ముంబై డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా ముఠాతో చేతులు క‌లిసి న‌గ‌రంలో వాటిని విక్ర‌యిస్తూ టాస్క్ ఫోర్స్ పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డాడు. 


కామాటీపురంకు చెందిన ఇసాక్ వృత్తి రిత్యా ఎల‌క్ట్రిషియ‌న్‌. సినిమాల్లో న‌టించాల‌నే కోరిక‌తో నాలుగేళ్ల క్రితం ఇంట్లో ఎవ‌రికీ చెప్ప‌కుండా ముంబై వెళ్లిపోయాడు. అక్క‌డ అవ‌కాశాల కోసం ఎంతో ప్ర‌య‌త్నించాడు. కానీ అవ‌కాశాలు రాలేదు. దీంతో డ్ర‌గ్స్ మ‌ఠాతో చేతులు క‌లిపాడు. 


హైద‌రాబాద్‌లో డ్రగ్స్‌ను విక్రయించేందుకు హెరాయిన్ తీసుకొని నగరానికి చేరాడు. అయితే ప‌క్కా స‌మాచారంతో పోలీసులు ఇసాక్‌ను అదుపులోకి తీసుకున్ని ప్రశ్నించారు. అత‌డి వద్ద నుంచి డ్ర‌గ్స్ ముఠాకు సంబంధించిన వివ‌రాల‌ను సేక‌రించారు పోలీసులు. వెంట‌నే రంగంలోకి దిగిన పోలీసులు 8 మంది స‌భ్యుల అంత‌రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేశారు. అందుకు ఇసాక్‌తో పాటు ఐదుగురిని అరెస్ట్ చేశారు. 


నిందితుల నుంచి 28 గ్రాముల హెరాయిన్, 5 మొబైల్ పోన్లు.. స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ దాదాపు 3 ల‌క్ష‌ల‌కు పైగా ఉంటుంద‌ని తెలిపారు సీపీ అంజ‌నీ కుమార్‌. అలాగే ముంబైలో డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేస్తున్న ఉస్మాన్ షేక్ ను అరెస్ట్ చేస్తే ఈ ముఠా మొత్తం బ‌ట్ట‌బ‌య‌ల‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: