ఈసారి ఏపీలో హోరా హోరీ పోటీ జరిగింది. అధికార టీడీపీని ప్రతిపక్ష వైసీపీ గట్టిగా ఢీ కొట్టింగ్. మధ్యలో వచ్చిన జనసేన ఎవరి కొంప ముంచిందో తెలియని పరిస్థితి ఉంది. దాంతో మ్యాజిక్ ఫిగర్ ని ఎవరు చేరుకుంటారన్నది కచ్చితంగా చెప్పలేని స్థితి. ఈ విషయంలో వైసీపీ ఒకింత నమ్మకంతో ఉంటే టీడీపీలో మాత్రం కంగారు కనిపిస్తోంది.


గత ఏడాది కర్నాటకలో జరిగిన మాదిరిగానే హార్స్ ట్రేడింగ్ పెద్ద ఎత్తున జరుగుతుందని ఏపీలో టీడీపీ నమ్ముతోంది. ఫలితాలు ఎలా వచ్చినా తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడమే కాకుండా ప్రత్యర్ధి పార్టీలకు గేలం వేయాలని టీడీపీ భావిస్తోందని అంటున్నారు. కర్నాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపు కాచడానికి అక్కడ బలమైన నేతగా  కాంగ్రెస్ కి చెందిన రాజశేఖరన్ ఉన్నారు. క్యాంప్ రాజకీయాలను షురూ చేసి మొత్తానికి కాంగ్రెస్, జేడీఎస్ సర్కార్ ఏర్పాటుకు ఆయన అన్ని రకాలుగా విజయవంతమయ్యారు. 


అదే పరిస్థితి ఏపీలో వస్తే బలమైన నాయకుడు ఎవరు క్యాంప్ రాజకీయాలు చేయగలరన్న ఆలోచన టీడీపీలో ఉందిట. కడపకు చెందిన సీనియర్ నేతని  ఈ విషయంలో ఉపయోగించుకుందామంటే ఆయన నా వల్ల కాదని చేతులెత్తెసినట్లుగా న్యూస్ వస్తోంది. ఆ నేత గతంలో ఇలాంటి ఆపరేషన్లు చేసి పార్టీకి గట్టి బూస్టప్ ఇచ్చారు. ఇపుడు ఆయన ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. దాంతో బిగ్ షాట్స్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. 
అటు టీడీపీ, ఇటు వైసీపీకి ఏ పార్టీకైనా పూర్తి మెజారటీ వస్తే ఏ పేచీ లేదు కానీ మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరలో ఎవరు వచ్చి ఆయిపోయినా హార్స్ ట్రేడింగ్ ఏపీలోనూ ఖాయమని అంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: