వాళ్లు టూరిస్టులు.. అడ‌విలో అందాల‌ను చూసేందుకు వ‌చ్చారు. అడ‌విలో క‌నిపించే వాటిని త‌మ కెమెరాల్లో బంధించాల‌ని ఆశ‌ప‌డ్డారు. ఇక్క‌డి వ‌ర‌కు అంతా బాగానే ఉంది. కానీ వాళ్ల దృష్టి అడ‌విలో సైలెంట్‌గా కృర‌మృగాల్ని షూట్ చేయాల‌ని స‌ర‌దానే కొంప‌ముంచింది. 


ఉత్త‌రాఖండ్ అడ‌విలో వ‌న్య‌ప్రాణుల‌ను చూసేందుకు వ‌చ్చిన టూరిస్టులకు ఓ గ‌జ‌రాజు గ‌జ‌గ‌జ వ‌ణికించాడు. స‌ఫారీగా వెళ్లిన ప‌ర్యాట‌కులు తాము తెచ్చుకున్న వాహ‌నంలో తిరుగుతూ అడ‌విలోని జంతువుల్ని వీడియో తీశారు. చివ‌ర‌గా భారీ సైజు ఏనుగు క‌నిపించ‌డంతో దాన్ని వీడియోతీశారు. అప్ప‌టి వ‌ర‌కు గ‌ప్‌చుప్‌గా ఉన్న ఆ గ‌జ‌రాజు టూరిస్టులు కెమెరాల‌తో సెల్ఫీలు తీసుకోవ‌డంతో కొపం వ‌చ్చింది. వాళ్లు తీస్తున్న వీడియో ఆ గ‌జ‌రాజుకు కూడా న‌చ్చ‌లేదేమో.. వాళ్లు వెళ్తున్న వాహ‌నాన్ని వెంబ‌డించింది. 


ఏనుగు ఆ టూరిస్టుల‌ను త‌రుముకొని వ‌స్తుండ‌టంతో భ‌యాందోళ‌న‌కు గురయ్యారు. గ‌ట్టిగా కేక‌లు పెట్టారు. వాళ్లు వెళ్తున్న వాహనాన్ని స్పీడ్‌గా పోనిచ్చారు. ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలోని రాంన‌గ‌ర్‌లోని సీతాబ‌నీ వైల్డ్ లైఫ్ రిజ‌ర్వ్ ఫారెస్ట్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఏనుగుతో సెల్ఫీ మోజుతో త‌మ ప్రాణాల మీద‌కు తెచ్చుకున్నారు. ఇక జీపులో ఉన్న మ‌రో వ్య‌క్తి ఈ దృశ్యాల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: