కామారెడ్డిలో ఏఆర్ కానిస్టేబుల్ సూసైడ్ అటెంమ్ట్ క‌ల‌క‌లం రేపుతోంది. కామారెడ్డిలో విధులు నిర్వ‌హిస్తున్న శ్రీనివాస్‌గౌడ్ త‌న స‌ర్వీస్ రివాల్వ‌ర్ తో ఏడ‌మ కాలు, చాతిపై కాల్చుకున్నాడు. దీనిని గ‌మ‌నించిన స్థానికులు వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించారు. స‌మాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు.. తీవ్రంగా గాయ‌ప‌డ్డ కానిస్టేబుల్ శ్రీనివాస్‌ను వెంట‌నే కామారెడ్డి ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి తర‌లించారు. 


మ‌రోవైపు కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డ విష‌యం తెలుసుకున్న జిల్లా ఎస్పీ శ్వేతా రెడ్డి హుటాహుటిన ఆస్ప‌త్రి వెళ్లారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన అన్ని వివరాల‌ను సేక‌రించారు. శ్రీనివాస్‌గౌడ్‌కు ప్ర‌థమ చికిత్స అందించిన త‌ర్వా.. ఎస్పీ ఆదేశంతో మెరుగైన వైద్యం కోసం ఆయ‌న్న హైద‌రాబాద్ కు త‌ర‌లించారు. కాగా.. కానిస్టేబుల్ ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకున్న‌ట్లు డాక్ట‌ర్లు తెలిపారు. 


శ్రీనివాస్ గౌడ్ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం పై వివిధ కోణాల్లో ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు డీఎస్పీ తెలిపారు. రాష్ట్రంలో వ‌రుస ఎన్నిక‌ల కార‌ణంగా బందోబ‌స్తు నిర్వ‌హ‌ణ‌లో ఒత్తిడికి లోనై సూసైడ్ అటెంమ్ట్ చేసుకున్నాడా..?   లేకా మరే ఇత‌ర కార‌ణాలా.. కుటుంబ స‌మ‌స్య‌లు ఉన్నాయా.. అన్న కోణంలో ఇన్వెస్టిగేష‌న్ చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు. 


ఇదిలా ఉంటే కానిస్టేబుల్ శ్రీనివాస్‌గౌడ్ వ‌రంగ‌ల్ ప‌ట్ట‌ణానికి చెందిన వ్య‌క్తి. అయితే ప‌ని ఒత్తిడి కార‌ణంగానే ఆయ‌న ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన‌ట్లు కుటుంబ ఆరోపిస్తున్న‌ట్లు స‌మాచారం. ఏదిఏమైనా పూర్తి వివ‌రాల‌న్నీ పోలీసుల ద‌ర్యాప్తులో వెల్ల‌డికాన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: