ఏపీలో జరిగిన హోరా హోరీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఈవీఎంలలో అంతా రాసి పెట్టేసి ఉంది. మేము ఇన్ని సీట్లు గెలుస్తాము, వచ్చేది మా ప్రభుత్వమేనని డప్పాలు కొట్టుకోవడం తమకు తాము ధైర్యం చెప్పుకోవడమే. అయితే ఇపుడు చంద్రబాబు పోలింగ్ సరళిపై పార్టీ నాయకులతో  రివ్యూస్ చేస్తున్నారు. ఎక్కడ ఎవరు గెలుస్తారన్నది ఆయన లోతైన విశ్లేషణ చేస్తున్నారు. మరి బాబు గారి శోధన, పరిశోధనలో బయటపడిన విషయాలేంటి...


అంటే చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఏంటంటే పోల్ మేనెజ్మెంట్లో మనం గట్టిగా దెబ్బతిన్నాం అని బాబుగారు చెప్పుకొచ్చారట. అంతా మీ వల్లే జరిగింది, మీరు చెప్పిన వారినే అభ్యర్ధులుగా ఎంపిక చేశాము, అన్ని రకాలుగా చూశాం, రాత్రి పగలూ ప్రచారం చేశాను, ఇంత చేస్తే  మీరు పోల్ మేనేజ్మెంట్ చేయ‌కపోవడమేంటని బాబు కస్సుమంటున్నారుట దీన్ని చూసిన తమ్ముళ్ళు . రివ్యూ మీటింగులో బాబు  గెలుపు సంగతేమో కానీ ఓటమికి కారణాలు బాగా ఎంచుతున్నారని  వాపోతున్నారుట.


ఇక గతంలో పోలిస్తే క్యాడర్లో నిర్లక్ష్యం  వచ్చిందని, అందువల్లనే ఈ పరిస్థితి దాపురించింద ని కూడా బాబు అన్నారని టాక్.  ఇంతలా మనం ఇబ్బంది పడడానికి పార్టీ నాయకులు వ్యవహరించిన తీరే కారణమని బాబు గట్టిగానే క్లాసులు పీకుతున్నట్లు భోగట్టా. ఈ రివ్యూల తీరు చూస్తే బాబు గెలుస్తామని చెబుతున్నారా లేక ఓడిపోతామని ముందే చెబుతున్నారా అన్నది తమ్ముళ్లకు అర్ధం కావడంలేదు. అచ్చం బావమరిది బాలయ్య తరహాలోలోనే మెజారిటీల విషయం చెప్పిన వారిని సైతం బాబు వెటకారం ఆడుతున్నారుట. మీరు చెప్పిన మెజారిటీలు రాకపోతే శిక్షలకు కూడా సిధ్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారుట. 


మరింత సమాచారం తెలుసుకోండి: