ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు అప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి హోదాలో క‌య్యానికి కాలు దువ్వుతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒక‌దాని త‌ర్వాత మ‌రొక‌టి అన్న‌ట్లుగా ఆయ‌న వివిధ అంశాల‌పై కెలుక్కుంటున్న తీరు చూస్తుంటే....ఇదే నిజ‌మ‌ని చ‌ర్చ అంటున్నారు. ఏపీలో ఎన్నికల కోడ్‌ వివాదాలు ఏకంగా రాజ్యాంగ సంక్షోభానికి దారి తీసేంతగా ముదిరాయి. ఈసీ, సీఎస్‌ ఒకవైపు.. ఓవైపు.. తమ వాదన వినిపిస్తుండడంతో అంతా గందరగోళంగా ఉంది. ఇదే టైమ్‌లో.. చంద్రబాబు ఏకంగా కేబినెట్ మీటింగే నిర్వహిస్తానని చెప్పడం సంచ‌ల‌నంగా మారింది. దీనికి తోడుగా పోల‌వ‌రంలో ప‌ర్య‌టిస్తాన‌ని ప్ర‌క‌టించి మ‌రింత సంచ‌ల‌నం సృష్టించారు. 


అమరావతిలో జరిగిన విలేకరుల సమావేశంలో చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడుతూ,  తాను పోలవరం వెళితే తప్పేమిటని ఈసీని ఉద్దేశించి ప్రశ్నించారు. తాను రేపు పోలవరంలో పర్యటించనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టు సమీక్షకు ఎన్నికల కోడ్ అడ్డంకి కాదని అన్నారు. అయితే ఇప్పటికే పలుమార్లు సీఎం సమీక్షలపై తీవ్ర దుమారం రేగిన నేపథ్యంలో.. ఇప్పుడు పోలవరం వెళతానని చంద్రబాబు అనడంపై.. దీనిపై ఈసీ ఎలా స్పందిస్తుందన్న విషయం ఆసక్తి కలిగిస్తోంది.


ఏపీలో ఎన్నికలు అయిపోయాక కూడా సుదీర్ఘంగా 42 రోజుల కోడ్ ఉన్న కారణంగా పాలన స్తంభించి పోవాలంటే ఎలాగనే పాయింట్‌తో చంద్ర‌బాబు ప్రశ్నిస్తున్నారు. అందుకే తాను కేబినెట్ సమావేశాలు, పోల‌వ‌రం ప‌ర్య‌ట‌న‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. నిబంధ‌న‌లు ఉల్లంఘించి చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకుంటున్న విధానం..ఎలాంటి ప‌రిణామాల‌కు దారితీస్తుందో వేచి చూడాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: