వచ్చే వారంలో క్యాబినెట్ మీటింగ్ పెడతానని చంద్రబాబునాయుడు సవాలు చేయగానే అందరిలోను టెన్షన్ పెరిగిపోతోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా విధానపరమైన నిర్ణయాలు తీసుకోకూడదు. మరి క్యాబినెట్ సమావేశం జరిగినపుడు విధానపరమైన నిర్ణయాలు తీసుకోకుండా ఎలా ? అందుకే కోడ్ అమలులో ఉండగా క్యాబినెట్ సమావేశాలు పెట్టుకోవద్దనేది.

 

ఇంత చిన్న విషయం కూడా 40 ఇయర్స్ ఇండస్ట్రీకి తెలీకుండానే ఉంటుందా ? తెలుసు అయితే ఎన్నికల కమీషన్ తో తలెత్తిన విభేదాల కారణంగానే క్యాబినెట్ మీటింగ్ పెడతానంటూ చంద్రబాబు సవాలు విసిరారు. ఉద్దేశ్యపూర్వకంగానే ఈసితో చంద్రబాబు ఘర్షణ పెంచుకుంటున్నారని అర్ధమైపోతోంది. క్యాబినెట్ సమావేశానికి హాజరుకాని ఉన్నతాధికారులపై బిజెనెస్ రూల్సు ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించటమే విచిత్రంగా ఉంది.

 

అయితే ఇక్కడే చంద్రబాబు ఓ విషయం మరచిపోయినట్లున్నారు. ఎలక్షన్ కమీషన్ పరిధిలో ఉన్న ఉన్నతాధికారులెవరూ క్యాబినెట్ మీటింగ్ కు హాజరుకారన్నది స్పష్టం. పైగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి క్యాబినెట్ కు కన్వీనర్ గా ఉంటారు. ప్రధాన కార్యదర్శి కూడా ఎలక్షన్ కోడ్ పరిధిలోకే వస్తారు కాబట్టి క్యాబినెట్ కు హాజరుకారు. సిఎస్సే హాజరుకానపుడు మిగిలిన వాళ్ళు హాజరయ్యే సమస్యే ఉత్పన్నం కాదు.

 

ఇక చర్యలంటారా ? చంద్రబాబు ఎవరి మీదా ఎటువంటి చర్యలూ తీసుకోలేరన్నది వాస్తవం.  ఏ ఒక్క అధికారి మీద కూడా నేరుగా చర్యలూ తీసుకునే అధికారం చంద్రబాబుకు లేదు. ఎవరిమీదైనా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అనుకుంటే ఆ విషయాన్ని నోట్ ఫైల్లో మాత్రమే చెప్పగలరు. మళ్ళీ దాన్ని అమలు చేయాలంటే చీఫ్ సెక్రటరీ సంతకం పెట్టాల్సిందే.  ఎక్కడ తేడా వచ్చిన పోయేది చంద్రబాబు పరువే.

 

సరే ఎవరిపై ఎవరు చర్యలు తీసుకోవాలన్నా మళ్ళీ ఆమోదం కోసం ఎన్నికల కమీషన్ కు పంపాల్సిందే ఫైలును. ఇవన్నీ అయ్యేటప్పటికి 23వ తేదీ ఫలితాలు వచ్చేస్తాయి. ఆరోజు అధికారంలో ఉండేదెవరో ఊడిపోయేదెవరో తెలిపోతుంది కదా. చంద్రబాబే అధికారంలో కంటిన్యూ అయ్యేట్లుంటే ఒక పద్దతి, లేకపోతే........


మరింత సమాచారం తెలుసుకోండి: