సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భాగంగా, లోక్‌సభ ఐదో విడుత ఎన్నికలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. 7 రాష్ర్టాల్లోని 51 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్‌లో 14, రాజస్థాన్‌లో 12, పశ్చిమ బెంగాల్‌లో 7, మధ్యప్రదేశ్‌లో 7, బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 4, జమ్ముకశ్మీర్‌లో 2 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఐదో విడుత ఎన్నికల బరితో రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఉన్నారు. 


-యూపీలో 14 స్థానాలకు పోలింగ్ జరుగనుండగా.. రాజ్‌నాథ్‌సింగ్, స్మృతీ ఇరానీ, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ 14 స్థానాల్లో 12 బీజేపీ ఖాతాలో పడ్డాయి. రాయ్‌బరేలీ, అమేథీలో సోనియా, రాహుల్ గెలుపొందారు. 
-రాజస్థాన్‌లో ఈ విడుతతో ఎన్నికలు ముగుస్తాయి. కేంద్ర మంత్రులు రాథో డ్, మేఘ్వాల్, ఒలింపియన్ క్రిష్ణపూనియా తదితరులు బరిలో ఉన్నారు.
-పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు జరుగనున్న ఏడు స్థానాలను 2014లో తృణమూల్ కాంగ్రెస్సే కైవసం చేసుకుంది.
-బీహార్‌లో ఐదు స్థానాలకు పోలింగ్ జరుగనున్నది. 
-జార్ఖండ్‌లో ఎన్నికలు జరుగుతున్న నాలుగు స్థానాలకు భద్రతా కారణాల రీత్యా రెండు గంటల ముందుగానే పోలింగ్ ముగియనుంది. 
-జమ్ముకశ్మీర్‌లో అనంత్‌నాగ్ నియోజకవర్గానికి సంబంధించి పుల్వామా, షోపియాన్ జిల్లాల్లో, లడఖ్ స్థానానికి పోలింగ్ జరుగనుంది. మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ బరిలో ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: