చంద్రబాబునాయుడుకు తొందరలో మరో షాక్ రెడీగా ఉంది. నిజానికి ఈ షాక్ ను తనంతట తానే తెచ్చుకుంటున్నారు. అదే 10వ తేదీ క్యాబినెట్ సమావేశంకు సంబంధించిందే రాబోయే షాక్. క్యాబినెట్ సమావేశం నిర్వహించటం ద్వారా ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంను ఇబ్బంది పెడదామన్నది చంద్రబాబు ఉద్దేశ్యమై ఉండొచ్చు. కానీ రివర్సులో తనకే షాక్ తగులుతుందని చంద్రబాబు అనుకుంటున్నట్లు లేదు.

 

విషయం ఏమిటంటే ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నపుడు క్యాబినెట్ సమావేశాలు పెట్టకూడదు. కానీ ప్రధానమంత్రి నరేంద్రమోడి, కెసియార్ ను సాకుగా చూపించి ఎలక్షన్ కమీషన్, సిఎస్ పై కసి తీర్చుకునేందుకే తాను కూడా క్యాబినెట్ సమావేశం పెడతానని చంద్రబాబు ప్రకటించారు.

 

మోడి, కెసియార్ లు క్యాబినెట్ సమావేశాలు పెట్టటానికి చంద్రబాబు క్యాబినెట్ సమావేశం పెడతాననటానికి చాలా తేడా ఉంది. దేశ రక్షణ వ్యవహారాలు, అంతర్గత భద్రత లాంటి అనేక అంశాలను చర్చించటానికి ప్రధానమంత్రి క్యాబినెట్ సమావేశం నిర్వహించవచ్చు. అలాగే తెలంగాణాలో కేవలం పార్లమెంటుకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. కెసియార్ క్యాబినెట్లో తీసుకునే నిర్ణయాలకు కెసియారే బాధ్యత వహించాలి.

 

కానీ ఏపిలో అలా కాదు. చంద్రబాబు మళ్ళీ సిఎం అవుతారో లేదో తెలీదు. కాబట్టి క్యాబినెట్ సమావేశాలు నిర్వహించకూడదన్నది ఎలక్షన్ కమీషన్ రూల్.  సరే ఇక అసలు విషయానికి వస్తే చంద్రబాబు క్యాబినెట్ సమావేశం పెట్టాలన్నా అందుకు ఎలక్షన్ కమీషన్ అంగీకరించాలి. ఎందుకంటే, అత్యవసరంగా క్యాబినెట్ సమావేశం నిర్వహించాల్సిన అవసరం లేదు. నిజంగా చంద్రబాబుకు క్యాబినెట్ సమావేశం పెట్టే ఉద్దేశ్యమే ఉంటే అందుకు ఎలక్షన్ కమీషన్ అనుమతి తీసుకోవాల్సిందే.

 

క్యాబినెట్ సమావేశం పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు కాబట్టి ఎలక్షన్ కమీషన్ అంగీకరించే పరిస్ధితి కనబడటం లేదు. కాబట్టి చంద్రబాబుకు షాక్ తప్పేట్లు లేదు. కోరి కొరివితో తల గోక్కోవటం చంద్రబాబుకు బాగా అలవాటైపోయింది.  మరో 16 రోజుల పాటు హాయిగా కుటుంబంతో గడపకుండా ఎందుకొచ్చిన తిప్పలు చంద్రబాబుకు అని పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: