సాధార‌ణంగా మ‌నం ఎవ‌రి ఇంటికైనా వెళ్తే డోర్ కొట్ట‌డమో.. కాలింగ్ బెల్ కొట్ట‌డ‌మో చేస్తాం. అలా వ‌చ్చిన సౌండ్‌తో ఇంట్లో వాళ్లు డోర్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ఓపెన్ చేస్తారు. వారి అనుమ‌తితో లోప‌ల‌కు ప్ర‌వేశిస్తాం. ఇలా బుద్ది జీవి అయిన మ‌నిషి చేసే ప‌ని అన్న‌మాట‌. మ‌నుషులు వారికి వాల్యూ ఇచ్చి ప‌ర్మీష‌న్ తీసుకుని లోప‌లికి వెళ్తుంటారు మ‌నుషులు. 


కానీ మ‌న‌ల్ని చూస్తూ ఉండే చాలా జంతువుల‌కు కూడా ఈ విష‌యం చ‌క్క‌గా అర్థ‌మవుతుంది. అందుకే మాన‌వులు చేస్తున్న ప‌నుల‌ను జంతువులు కూడా అనుస‌రించే ప్ర‌య‌త్నం చేస్తుంటాయి. అలాంటి మ‌నం చాలానే చూసి ఉంటాం. దానికి ఉదాహ‌ర‌ణ ఇటీవ‌ల కాలిఫోర్నియాలో జ‌రిగిన సంఘట చూస్తే మీకే తెలుస్తోంది. 


మైర్టిల్ ప్రాంతానికి చెందిన కారెన్ ఆల్ఫానో అనే మహిళ షాపింగ్‌కు వెళ్లింది. అయితే ఆమె తిరిగొచ్చేసరికి ఇంటి ముందు ఎవరో ఉన్న‌ట్లు.. కాలింగ్ బెల్లు కొడుతున్న‌ట్లు ఏవేవో శ‌బ్దాలు వినిపించాయి త‌న‌కు. అయితే ఆమె అక్క‌డకు వెళ్లి చూడ‌గానే షాక్‌.. అంతే ఒక్క‌సారిగా గుండె ఆగినంత‌ప‌నైంది. 


ఎందుక‌నుకుంటున్నారా.. త‌న ఇంటి త‌లుపు కొడుతోంది ఏంటో కాదు.. ఒక మొస‌లి. వెన‌క కాళ్ల‌పై బ‌ల‌వంతంగా నిల‌బ‌డి మ‌రి త‌లుపు కొడుతూ.. ఇంటి కాలింగ్ బెల్ కొట్ట‌డానికి ప్ర‌య‌త్నిస్తోంది. దాన్ని చూసిన కారెన్ వెంట‌నే త‌న ఫోన్ తీసి మొసలి చేసిన దృశ్యాల‌ను చిత్రీక‌రించింది. త‌న కెమెరాలో ఆ మొస‌లి ప్ర‌వ‌ర్త‌న‌ను బందించింది. 


ఇక కాలింగ్ బెల్ అంద‌క‌పోవ‌డంతో కాసేప‌టికి ఆ మొస‌లి సాడ్‌గా వెన‌క్కి వెళ్లింది. ఆ మొస‌లి గురించి స‌మాచారం అందుకున్న సంబంధిత అధికారులు .. దాన్ని తీసుకెళ్లి ఊరి చివరలో విడిచిపెట్టి పెట్టారు. ఇటీవలే ఓ పిల్లి కూడా కార్డిఫ్‌లో ఇలానే ఓ ఇంటి తలుపు కొడుతూ దర్శనమిచ్చింది. ఈ విష‌యాల‌ను వారు సోష‌ల్ మీడియా ద్వారా పంచుకున్నారు. దానికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో చెక్క‌ర్లు కొడుతోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: