ఈనెల 23వ తేదీన మొదలయ్యే కౌంటింగ్ లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ జోస్యం చెప్పారా ?  మీడియాతో మాట్లాడుతు ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు అలాగే అనిపిస్తున్నాయి. ఎన్నికల్లో టిడిపి ఓడిపోతే ఏమైపోతుంది ? అంటూ నేరుగా చంద్రబాబునాయుడునే నిలదీశారు. అంటే ప్రశ్నలోనే సమాధానం కూడా ఉన్నట్లే అనిపిస్తోంది.


పార్టీ పెట్టినప్పటి నుండి టిడిపికి గెలుపోటములు కొత్తేమీ కాదు కదా ? అంటూ చంద్రబాబును డైరెక్టుగానే ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో టిడిపి ఓడిపోతే పార్టీని మూసేస్తారా ? అనే ప్రశ్న తలెత్తదు కదా ? అని అడిగారు. చంద్రబాబులో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందని కూడా అన్నారు.

 

పార్లమెంటు ఎన్నికల్లో గనుక టిడిపికి ఓ 10 సీట్లు వస్తే చాలు ఢిల్లీలో చక్రంతిప్పటానికి చంద్రబాబుకు ఎటువంటి ఇబ్బంది ఉండదని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. ఉండవల్లి చెప్పిన విషయంలో చాలామందికి చాలా అనుమానలున్నాయి లేండి అది వేరే సంగతి.

 

రేపటి కౌంటింగ్ లో ఓడిపోతే ఏమవుతుంది అని ప్రశ్నించటం ద్వారా ఇన్ డైరెక్టుగా టిడిపి ఓటమి ఖాయమని ఉండవల్లి చెప్పదలచుకున్నారా అనే ప్రచారం జోరందుకుంది. పార్టీని పెట్టిన ఎన్టీయార్ హయాంలోనే టిడిపి ఓడిపోయింది. ఎన్టీయార్ ను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న తర్వాత చంద్రబాబు హయాంలో కూడా టిడిపి రెండు ఎన్నికల్లో ఓడిపోయింది. అదే విషయాన్ని ఉండవల్లి ప్రస్తావించారు. కాబట్టి ఉండవల్లి మాటలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు మానసికంగా ఓటమికి సిద్ధంగా ఉండటమే మేలు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: