ఎన్నిక కోడ్‌ ఉన్న సమయంలో ఏపి మంత్రి వర్గ సమావేశం నిర్వహించడం పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో అనుకున్న తేదీన సమావేశం జరిగేట్టు లేదు. చంద్రబాబు కార్యాలయం సీఎస్‌కు పంపిన నోట్‌పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌.వి. సుబ్రమణ్యం అధికారులతో సమాలోచనలు జరిపిన విషయం తెలిసిందే. 


ఈ నెల 10న మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయాలంటూ సీఎం పంపిన లేఖకు స్పందన ఇంకా రాలేదు కానీ, 10న మాత్రం మంత్రి వర్గ సమావేశం జరగే అవకాశం లేదని అనధికార వర్గాలు అంటున్నాయి. ముందస్తుగా అనేక విషయాలపై కసరత్తు చేయాల్సి ఉన్నందున మంత్రి వర్గ సమావేశం తేదీని 14వ తేదీకి వాయిదా వేయాలని సిఎం కి అధికారుల నుండి సలహా రావడంతో అందుకు సమ్మతించక తప్పని పరిస్థితి చంద్రబాబుకు ఏర్పడింది.

'' కాబినెట్‌ సమావేశానికి సంబంధించిన ఎజెండా వివరాలు ఎన్నికల సంఘానికి పంపి, చంద్రబాబు అనుమతి తీసుకోవాలి'' అని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: