సంగారెడ్డి జిల్లాలో దారుణ సంఘ‌ట‌న చోటుసుకుంది. అప్పుడే పుట్టిన ప‌సిపాప‌ను ఓ మ‌హిళ ఎత్తుకెళ్లింది. జిల్లా కేంద్రంలోని మాతాశిశు ఆరోగ్య సంర‌క్ష‌ణ కేంద్రంలో ఈ ఘట‌న జ‌రిగింది. సంగారెడ్డి మండ‌లం క‌ల్ప‌గూర్ గ్రామానికి చెందిన మాధ‌వి గ‌త నెల 30న ప్ర‌స‌వం కోసం జిల్లా కేంద్రంలోని ఆస్ప‌త్రికి వ‌చ్చారు. వైద్యులు ప‌రీక్ష‌లు చేసి సాధార‌ణ కాన్ఫు చేయ‌డంతో ఆడ‌శిశువుకు జ‌న్మ‌నిచ్చారు.


 ఆ త‌ర్వాత ఆమె ఇంటికి వెళ్లి శిశువుకు జాండీస్ వ‌చ్చాయ‌ని ఈ నెల 3న జిల్లా కేంద్ర ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. అయితే మంగ‌ళ‌వారం ఉద‌యం ప‌సికందును న‌వ‌జాత శిశు కేంద్రంలో ఉంచారు. అనంత‌రం ఆస్ప‌త్రి సిబ్బంది ఆ ప‌సికందుకుఏ మాద‌వి కుటుంబ స‌భ్యుల‌కు ఇవ్వాల్సి ఉంది. కానీ సిబ్బంది మాత్రం అక్క‌డ ఉన్న వేరే మ‌హిళ చేతిలో పెట్టారు. 


ఇక త‌మ చిన్నారి ఎక్క‌డ ఉంది అంటూ ఆ సిబ్బందిని మాధ‌వి కుటుంబ స‌భ్యులు ప్ర‌శ్నించారు. వారు పొంత‌న లేని స‌మాధానం చెప్పారు. దీంతో ఆస్ప‌త్రి మొత్తం ఆ శిశువు కోసం వెతికారు. అయినా ఫ‌లితం లేకుండా పోయింది. కాగా.. సిబ్బందిని శిశువును ఎవ‌రికి ఇచ్చారు.?  పాప‌ను తీసుకున్న మ‌రో మ‌హిళ ఎవ‌రు అన్న విష‌యాల‌పై క్లారిటీ రావాల్సి ఉంది. 


దీంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు బాధితురాలు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఆస్ప‌త్రిలోని సీసీ ఫుటేజీల‌ను ప‌రిశీలిస్తున్నారు. దీంతో పాప‌ను ఇచ్చిన ఆయాను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 


పిల్ల‌ల కోసం మొక్క‌ని దేవుళ్లు లేరంటూ.. తిర‌గ‌ని ఆస్ప‌త్రి లేదంటూ ఆ క‌న్న‌త‌ల్లి బాధ చెప్ప‌లేనిది. పెళ్లైన ప‌దేళ్ల త‌ర్వాత అమ్మాయి పుట్టింది. నా బంగారు త‌ల్లిని చూసుకున్న ముచ్చ‌ట కూడా మూన్నాళ్ల ముచ్చ‌ట‌గానే మారింద‌ని ఆ త‌ల్లి బాధ‌ప‌డుతుంది. నా బిడ్డను ఎవరు తీసుకెళ్లారో తెచ్చి ఇవ్వండమ్మా.. అంటూ ఆ కన్నతల్లి రోదించడం అక్క‌డున్న‌వారంద‌రినీ కంట త‌డి పెట్టత‌డి పెట్టించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: