ఏపీలో ఎన్నికలు ముగిసాయి కానీ వేడి అలాగే ఉంది. ఇక ఈవీఎం బ్యాలెట్ ముగిసినా పోస్టల్ బ్యాలెట్ అలాగే ఉంది. ఫలితాలకు ముందు రోజు వరకూ పోస్టల్ బ్యాలెట్ వోటింగ్ ఉపయోగించుకోవచ్చు. దాంతో ఇపుడు దాని గురించే అంతా వేటాడుతున్నారు. విశాఖ జిల్లాలో ఓట్ల వేటకు ఈ విధంగా ఇప్పటికీ తెరపడలేదు. విశాఖలో పదిహేను అసెంబ్లీ, మూడు పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. మామూలుగా ఇక్కడ టీడీపీకి మంచి బలం ఉంది. అయితే వైసీపీ గాలి బాగా ఉందని అంతా భావిస్తున్న వేళ పోటీ మాత్రం గట్టిగా ఉందని అంటున్నారు. కొన్ని సీట్లలో ఎవరు గెలిచినా వందల్లో కూడా మెజారిటీ ఉండొచ్చు అన్న మాట వినిపిస్తోంది.


విశాఖలో యాభై వేల మంది వరకూ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు ఉన్నారు. అయితే వారిలో చాలా మందికి పోస్టల్  బ్యాలెట్ అందలేదు.  పోలింగ్ ముందు రోజు వరకూ పోస్త్ల బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నా విశాఖ జిల్లాలో మాత్రం ఏప్రిల్  7వ తేదీతో ముగించారు. దీంతో అందరికీ పోస్టల్  బ్యాలెట్ అందలేదు. ఇప్పటికీ  వేలాదిమంది పోస్టల్ ఓటు వేయలేకపోయారు.  దీనిపై వైసీపీ పలుమార్లు విశాఖ జిల్లా కలెక్టర్ని కలసి  డిమాండ్ చేస్తూ వచ్చింది. అందరు ఉధ్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలని కోరింది. టీడీపీకి అనుకూలంగా జిల్లా ఎన్నికల అధికారులు వ్యవహరిస్తున్నరని వైసీపీ అంటోంది. పోస్ట్ల బ్యాలెట్ అంటే సర్కార్ కి వ్యతిరేకంగా పడుతుందన్న ఉద్దేశ్యంతోనే ఇలా చేస్తున్నారని కూడా పేర్కొంటున్నారు.


మొత్తం సీట్లలో సగానికి సగం చోట్ల వైసీపీ, టీడీపీ మధ్యన టైట్ ఫైట్ నడిచింది. ప్రతి నియోజకవర్గంలో మూడు వేలకు తక్కువ కాకుండా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఉంది. ఇందులో మెజారిటీ ఓట్లు వైసీపీకి పడతాయని ఆ పార్టీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. అందుకోసం ఇప్పటికి పలు దఫాలుగా కలెక్టర్ని కలసి అందరికీ ఓట్లు కల్పించాలని కోరుతోంది. విశాఖ చరిత్రలోనే పోస్టల్ బ్యాలెట్ వల్ల గెలిచిన ఎంపీగా కొణతాల రామక్రిష్ణకు పేరుంది. ఆయన కేవలం తొమ్మిది ఓట్ల తేడాతో 1989లో గెలిచారు. అప్పట్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో అత్యధికం ఆయన‌కు పడడంతో అనూహ్యంగా ఎంపీ అయిపోయారు. ఇపుడు కూడా ప్రతీ చోటా హోరాహోరీగా పోరు సాగిందన్న సంకేతాలు ఉన్న టైంలో పోస్టల్ బ్యాలెట్ మొత్తం జాతకాలు మారుస్తుందని వైసీపీ విశ్వాసంతో ఉంది. చూడాలి మరి అందరికీ పోస్టల్ బ్యాలెట్ అందుతుందో లేదో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: