పరారీలో ఉన్న టివి మాజీ సీఈవో రవిప్రకాశ్ భార్యకు పోలీసులు నోటీసులు అందించారు. పోర్జరీ, మోసం తదితర ఆరోపణలను ఎదుర్కొంటున్న రవిప్రకాశ్ పై సైబర్ క్రైం పోలీసులు గాలిస్తున్నారు. విచారణకు హాజరుకావాలంటూ రవిప్రకాశ్ కు నోటీసులు ఇవ్వటానికి వెళ్ళిన పోలీసులకు మాజీ సీఈవో అందుబాటులో లేకపోవటంతో నోటీసులను ఆయన భార్యకు అందించారు. రేపు ఉదయం తమ విచారణకు హాజరుకావాలంటూ భార్యను పోలీసులు కోరటం సంచలనంగా మారింది.

 

టివి9 యాజమాన్యం గొడవలతో రవిప్రకాశ్ భార్యకు ఎంత సంబంధం ఉందో ఎవరికీ తెలీదు. కానీ మాజీ సీఈవో పరారీలో ఉన్న కారణంగా ఆయన భార్య పోలీసు విచారణను ఎదుర్కోవాల్సొస్తోందిపుడు. పోర్జరీ కేసంటే చాలా సీరియస్ అఫెన్సు క్రిందే లెక్క. అందులోను పెద్ద ఎత్తున నిధుల గోల్ మాల్ కూడా జరిగిందని యాజమాన్యం ఆరోపిస్తోంది. దాంతో పోర్జరీతో పాటు నిధుల గోల్ మాల్ కేసులను రవిప్రకాశ్ ఒకేసారి ఎదుర్కోవాల్సుంటుంది.

 

పనిలో పనిగా వివాదంలో కేంద్రబిందువుగా ఉన్న నటుడు శివాజీకి కూడా పోలీసులు నోటీసులిచ్చారు. నారాయణగూడ, హిమాయత్ నగర్ లోని శివాజి ఇంటిని కూడా పోలీసులు సోదాలు చేశారు. శివాజి, రవిప్రకాశ్ ఇద్దరూ కలిసి నాటకాలు ఆడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

 

అనుమానితులిద్దరూ ప్రస్తుతానికైతే పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రవిప్రకాశ్ అమెరికాలో ఉన్నాడని ఒక ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో రవిప్రకాశ్ పాస్ పోర్టును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు మరో ప్రచారం జరుగుతోంది. నిజానికి రెండు పరస్పర విరుద్ధమైన ప్రచారాలు. మాజీ సీఈవో అమెరికాలో ఉంటే పాస్ పోర్టును ఇక్కడి పోలీసులు ఎలా స్వాధీనం చేసుకోగలరు ? పోలీసులు రవిప్రకాశ్ పాస్ పోర్టును స్వాధీనం చేసుకోవటం నిజమే అయితే ఆయన అమెరికాకు ఎలా వెళ్ళగలరు ?

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: