చంద్రబాబునాయుడు వెన్నుపోటుకు చిన్న వయస్సులోనే మంత్రైన కిడారి శ్రవణ్ కుమార్ బలైపోయారు. ఏ సభలో కూడా సభ్యుడు కాని మంత్రి నిబంధనల ప్రకారం మంత్రిపదవికి రాజీనామా చేసేశారు. పోయిన నవంబర్ 11వ తేదీన శ్రవణ్ ను చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకున్నారు.  మంత్రి తండ్రి, ఫిరాయింపు ఎంఎల్ఏ కిడారి సర్వేశ్వర రావు ను మావోయిస్టులు కాల్చి చంపేసిన విషయం తెలిసిందే.

 

ఊహించని రీతిలో కిడారిని మావోయిస్టులు చంపేయటాన్ని సెంటిమెంటుగా వాడుకోవాలని చంద్రబాబు ఆలోచించారు. వెంటనే కొడుకు శ్రవణ్ కుమార్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. నిజానికి అప్పటికి శ్రవణ్ ఇటు ఎంఎల్ఏ కాదు అటు ఎంఎల్సీ కూడా కాదు. అయినా సరే శ్రవణ్ ను కావాలనే చంద్రబాబు మంత్రిని చేశారు.

 

శ్రవణ్ ను మంత్రిని చేసిన చంద్రబాబుకు ఎంఎల్సీగా నామినేట్ చేయాలని తెలీదా ? ఎంఎల్సీగా కానీ ఎంఎల్ఏగా కానీ చేయకపోతే ఆరుమాసాల్లో మంత్రిపదవి పోతుందని తెలుసు కద ? ఒకపుడు బావమరది దివంగత నేత నందమూరి హరికృష్ణను కూడా ఇలాగే మంత్రిని చేశారు. తర్వాత పట్టించుకోకపోవటంతో హరి ఆరుమాసాల తర్వాత రాజీనామా చేశారు.

 

చూడబోతే శ్రవణ్ ను కూడా అలాగే వాడుకుని వదిలేద్దామని అనుకున్నట్లున్నారు చంద్రబాబు. అందుకే శ్రవణ్ ను కనీసం శాసనమండలి సభ్యునిగా కూడా చేయలేదు. అంటే శ్రవణ్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచినట్లు అర్ధమైపోతోంది.  వెన్నుపోటు ఫలితంగానే శ్రవణ్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. 23వ తేదీన ఎటూ మంత్రివర్గమే రద్దవుతున్న ప్రచారం వేరే సంగతి. అందరితో కాకుండా ముందే శ్రవణ్ రాజీనామా చేయాల్సి రావటం కేవలం చంద్రబాబు వెన్నుపోటు ఫలితం కాక మరేమిటి ?


మరింత సమాచారం తెలుసుకోండి: