చంద్రబాబునాయుడుకు తాజాగా చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం మరో షాక్ ఇచ్చినట్లే ఉంది. క్యాబినెట్ సమావేశం నిర్వహణపై తాను చొరవ తీసుకోకుండా మొత్తం బాధ్యతను చీఫ్ ఎలక్షన్  కమీషనర్ ముందుకు వెళ్ళేట్లుగా పావులు కదిపారు. అంటే అక్కడి నుండి కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్ళటం ఖాయంగా అర్ధమైపోతోంది. పైగా ఎన్నికల కమీషనర్ కు పంపిన అంశాల్లో ఉపాధి హామీ పథకంలో జరిగిన పనులకు నిధులు విడుదల లాంటి కీలకమైన అంశం ఉందని స్పష్టం చేశారు.

 

 బిల్లులు చెల్లింపంటేనే ఆర్ధికపరమైన అంశం క్రిందకు వస్తుంది. అందులోను చిన్న మొత్తం కూడా కాదు. దాదాపు రూ. 2 వేల కోట్ల పైగా బిల్లులు చెల్లింపులట. అందులోను పెండింగ్ లో ఉన్న బిల్లులన్నీ టిడిపి నేతలు చేసిన పనుల బిల్లులే అని అర్ధమైపోతోంది. ఎల్వీ బాధ్యతలు తీసుకున్న తర్వాత అలాంటి బిల్లులన్నింటినీ పక్కన పెట్టేశారట. అందుకే క్యాబినెట్ సమావేశం పెట్టి బిల్లులను మంజూరు చేయించుకోవాలన్నది చంద్రబాబు పట్టుదలగా చెబుతున్నారు.

 

నిజానికి ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నపుడు ఎలాంటి ఆర్ధిక పరమైన అంశాలు కానీ విధానపరమైన నిర్ణయాలు కానీ తీసుకోకూడదు. ఈ రెండు లేకుండా క్యాబినెట్ సమావేశం జరగదు. అందుకనే ఎలక్షన్స్ జరిగేటపుడు క్యాబినెట్ సమావేశాలు పెట్టకూడదని చెబుతారు. కానీ చంద్రబాబునాయుడు మాత్రం ఎన్నికల సంఘం, ఎల్వీ పై పంతంతో మాత్రమే క్యాబినెట్ సమావేశం నిర్వహణకు పట్టుబడుతున్నారు.

 

మొత్తానికి 10వ తేదీ క్యాబినెట్ జరపాల్సిందే అన్నారు. తర్వాత విధిలేక 14వ తేదీకి వాయిదా వేసుకున్నారు. సిఎస్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటి తన సిఫారసులను ఎలక్షన్ కమీషన్ కు పంపేసింది. అందులో ఫణితుపాను, కరువు, మంచినీటి ఎద్దడి, ఉపాధిహామీ పథకం అంశాలపై చర్చ అంటూ స్పష్టం చేశారు. పనిలో పనిగానే నాలుగు అంశాలను పంపుతూనే ఉపాధి హామీ పథకంలో జరిగిన పనుల బిల్లుల చెల్లింపు అనే అంశాన్ని హైలైట్ చేశారని సమాచారం.

 

ఇక్కడ విషయం ఏమిటంటే క్యాబినెట్ సమావేశం జరపాలన్న చంద్రబాబు పట్టుదల వెనుక రాష్ట్రావసరాలకన్నా సొంత అజెండానే అని అర్ధమైపోతోంది. ఫణితుపాను, కరువు, మంచినీటి ఎద్దడి అన్న అంశాలపై రోజు సిఎస్ సమీక్షలు చేస్తునే ఉన్నారు. పైగా తుపాను వెళ్ళిపోయిన తర్వాత చంద్రబాబు క్యాబినెట్ లో ఇపుడు చర్చించేదేముంటుంటి ? కాబట్టి సిఎస్ నోట్ ప్రకారం క్యాబినెట్ సమావేశానికి అనుమతి ఇవ్వాలా వద్దా అన్నది కేంద్ర ఎన్నికల కమీషన్ కోర్టులోకి చేరుకుంది. ఆర్ధిక అంశాలు కూడా ముడిపడి ఉంది కాబట్టి క్యాబినెట్ కు అనుమతి తక్కువగానే ఉందని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: