ఇపుడిదే అంశంపై తెలుగుదేశంపార్టీలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని తరచూ చెప్పుకునే చంద్రబాబునాయుడు రాజకీయాల పరిణామాలను అంచనా వేయటంలో ఎక్కడ ఫెయిలయ్యారు అన్న విషయాలను టిడిపి నేతలు చర్చించుకుంటున్నారు. జాతీయ స్ధాయిలో అధికారంలోకి రాబోయేది యూపిఏనే అని చంద్రబాబు దాదాపు ఏడాది క్రితం అంచనా వేసుకున్నారు. అందుకనే నరేంద్రమోడితో గొడవలు పడి ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేశారు. కానీ ఎన్నికలు మొదలైన తర్వాత చూస్తే సీన్ రివర్సులో ఉంది.

 

 ఎన్నికలు మొదలైన తర్వాత క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు చూస్తుంటే అందరికీ అలాగే అనిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశంపార్టీ అధికారంలోకి రావటం దాదాపు కష్టమన్న అభిప్రాయం ఆ నేతల్లోనే వ్యక్తమవుతోంది. ఈ పరిస్దితుల్లోనే చంద్రబాబు తన దృష్టిని జాతీయ రాజకీయాలపైకి మరల్చారు. రాష్ట్రంలో అధికారం కోల్పోతే తనకొచ్చే సమస్యలేమిటో చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకనే జాతీయ స్ధాయిలో అధికారంలోకి వచ్చే కూటమిలో ఉంటే ఇబ్బందులుండవని అనుకున్నారు.

 

అందుకనే బద్ధశతృవైన కాంగ్రెస్ తో కూడా చేతులు కలపారు. అయితే చంద్రబాబు ఒకటి తలిస్తే జరుగుతున్నది ఇంకోటిగా కనిపిస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో ఎన్టీఏని మట్టి కరిపించి యూపిఏ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు అనుకున్నారు. అందుకనే దాదాపు ఏడాది ముందుగా పెట్టుకుని ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేశారు. తీరా ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత చూస్తే పరిస్ధితి ఉల్టాగా కనబడుతోంది.

 

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపిఏ అధికారంలోకి రాకపోతే చంద్రబాబు పరిస్ధితేంటి అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఎంపి స్ధానాలు తగ్గినా, బిజెపి బలం తగ్గినా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మళ్ళీ బిజెపియే వస్తుందని అంచనాలు పెరిగిపోతున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ పరిస్ధితి కూడా ఏమంతా గొప్పగా ఉండే అవకాశం లేదని అంచనాలున్నాయి. అంటే అధికారంలోకి వచ్చే మొదటి అవకాశం మళ్ళీ ఎన్డీఏకే ఉందని అర్ధమవుతోంది.

 

ఇక్కడే చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోందిట.  రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చి కేంద్రంలో మళ్ళీ మోడినే ప్రధాని అయితే చంద్రబాబు పరిస్దితి ఎలాగుంటుందో చెప్పనే అక్కర్లేదు. బహుశా తన 40 ఇయర్స్ ఇండస్ట్రీలో రాజకీయ పరిణామాలను అంచనా వేయటంలో ఫెయిల్యూర్ కావటం చంద్రబాబుకు ఇదే మొదటిసారవుతుందేమో.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: