టీడీపీ బడా నేత రాయపాటి సాంబశివరావు పార్టీ మారనున్నాడని కొని రోజులు నుంచి బాగా హల్ చల్ చేస్తున్న న్యూస్. అయితే 2014 ఎన్నికలకు ముందు రాయపాటి ఫ్యామిలీ మొత్తం కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు గాలి వీచే ప్రమాదాన్ని గుర్తించిన కాంగీ నేతలంతా ఆ పార్టీని వీడారు. ఈ జాబితాలో రాయపాటి ఫ్యామిలీ కూడా ఉంది. తనయుదు రంగారావు - సోదరుడు శ్రీనివాస్ - సోదరుడి కుమారుడు మోహన్ సాయికృష్ణలతో కలిసి సాంబశివరావు టీడీపీలో చేరారు.


అప్పటికే రాష్ట్రంలోనే బలమైన నేతగా ఉన్న రాయపాటికి నరసరావుపేట ఎంపీ టికెట్ ఇచ్చిన చంద్రబాబు... శ్రీనివాస్ కు ఏదో ఒక నామినేటెడ్ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే ఐదేళ్ల కాలం ముగిసిపోయినా శ్రీనివాస్ కు అవకాశం దక్కలేదు. అయితే ఈ ఎన్నికల్లో అయినా తమకు అవకాశం దక్కుతుందని శ్రీనివాస్ - మోహన్ సాయికృష్ణ భావించారు. మరోవైపు సాంబశివరావు కూడా తన కుమారుడు రంగారావుకు అసెంబ్లీ సీటు ఆశించారు.


అయితే ఏ క్షణంలో అయినా రాయపాటి ఫ్యామిలీ మొత్తం వైసీపీలో చేరిపోయే అవకాశాలున్నాయన్న వాదనతో ఒక్క రాయపాటికి మాత్రమే ఆయన సిట్టింగ్ స్థానం నరసరావుపేట ఎంపీ సీటు ఇచ్చేసిన చంద్రబాబు... ఇటు రంగారావుతో పాటు అటు శ్రీనివాస్ - మోహన సాయికృష్ణలకు మొండి చెయ్యే చూపారు. ఈ నేపథ్యంలో టికెట్లు ఖరారైన నాటి నుంచే శ్రీనివాస్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: