రోజురోజుకూ ఫైనాన్స్ సంస్థ‌ల ఆగ‌డాలు మితిమీరుతున్నాయి. ఫైనాన్స్ ఇస్తామంటూ ముందుగా మాట క‌లిపి తీరా వినియోగదారులు డ‌బ్బులు క‌ట్ట‌ని స‌మ‌యంలో రెట్టింపు స్థాయిలో డ‌బ్బులు వ‌సూలు చేస్తున్నారు. కొన్ని సంస్థ‌లు అయితే వేధింపుల‌కు గురి పాల్ప‌డుతున్నాయి. దీంతో ఎంతో మంది మ‌న‌స్తాపానికి గురై ఆత్మ‌హ‌త్యాయత్నానికి పాల్ప‌డుతున్నారు. 


తాజాగా బాల్ రాజు అనే వ్య‌క్తి ఓ ఫైనాన్స్ సంస్థ వేధింపులు తాళ‌లేక ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డాడు. కామారెడ్డికి చెందిన బాల్‌రాజ్‌.. ఎస్సార్ ఫైనాన్స్‌ సంస్థ దా్వారా త‌న ఆటోకు ఫైనాన్స్ చేస్తున్నాడు. ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో రెడు నెల‌ల ఫైనాన్స్ డ‌బ్బులు చెల్లించ‌లేదు. దీంతో ఎలాంటి స‌మాచారం లేకుండానే ఆటోను లాక్కున్నారు. 
ఆటోలో చిన్న‌పిల్ల‌లు ఉన్నార‌ని కూడా చూడ‌కుండా ఫైనాన్స్ సంస్థ ఏజెంట్‌లు న‌డిరోడ్డుపైనే ఆటోను లాక్కున్నాడు. దీంతో మ‌న‌స్తాపానికి గురైన బాల్‌రాజు ఎస్సార్ ఫైనాన్స్ ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డాడు. 


మ‌రోవైపు సికింద్రాబాద్ హైద‌రాబాద్‌లోనూ ఇదే త‌ర‌హా ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఓ చిట్‌ఫండ్ వేధింపుల‌కు నిండు ప్రాణం బ‌లైంది. నాచారం ప్రాంతానికి చెందిన నాగయ్య అనే వ్య‌క్తి రైల్వే లో ప‌నిచేస్తున్నాడు. అత‌డు ప‌నిచేస్తున్న స‌మ‌యంలో త‌న మిత్రుడు చిట్ ఫండ్స్ లో ల‌క్ష రూపాయ‌లు రుణం తీసుకున్నాడు. ఈ రుణానికి షూరిటీ సంతకాలు న‌గ‌మ‌య్య చేశారు. 


ఇంకేముందు త‌న మిత్రుడు తీసుకున్న రుణం చెల్లించ‌క‌పోవ‌డంతో నాగ‌మ‌య్య‌కు నోటీసులు వ‌చ్చాయి. ఆయ‌న మిత్రుడు తీసుకున్న డ‌బ్బులు వ‌డ‌డ్ఈతో క‌లిసి మొత్తం మూడు ల‌క్ష‌లు అయ్యింది. ఆ సొమ్మంతా క‌ట్టాల‌ని నోటీసులో పేర్కొన్నారు. దీంతో కంగుతిన్న నాగ‌మ‌య్య బ్రాంచ్ ను సంప్ర‌దించారు. వారు త‌ప్ప‌క క‌ట్టాల‌ని వేధింపుల‌కు గురి చేశారు. 


దీంతో చేసేది లేక నాగ‌మ‌య్య అక్క‌డే పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. సీసీ కెమెరాలో ఇరువురి మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ రికార్డ్ అయ్యింది. ఈ విష‌యంపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు సీసీ పుటేజ ఆధారంగా కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: