ఈసారి జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్ కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని సర్వేలు చెబుతున్నాయి. అయితే జగన్ సీఎం అవడానికి సర్వేలతో పాటు అనేక ఇతర కారణాలు కూడా ప్రభావితం చేస్తున్నాయని చెప్పాలి. జగన్ పదేళ్ళ రాజకీయ కష్టానికి ప్రతిఫలం ఇపుడు ఈ ఎన్నికల్లో ప్రజలు ఇవ్వబోతున్నారు. 


1. జగన్ తన తండ్రి మరణించాక ఎక్కువ సమయం గడిపింది జనంల్లోనే. జగన్ పట్ల  గత ఎన్నికల్లో ప్రజలు  ఏ విధమైనా  వ్యతిరేకతతో  లేరు. అయితే  పొత్తులు, ఇతర  సమీకరణల వల్ల మాత్రమే ఆయన కొద్ది శాతం తేడాతో అధికారానికి దూరమయ్యారు. ఆ విధంగా చూసుకుంటే ఈసారి అధికారం జగన్ కి  తప్పదు.


2 పాదయాత్ర సెంటిమెంట్. ఇది ఇప్పటికీ ఏపీలో ఇద్దరిని ముఖ్యమంత్రులను చేసింది. 2004లో వైఎస్సార్ పాదయాత్ర వల్లనే ముఖ్యమంత్రి అయ్యారు. ఇక 2014 ఎన్నికల్లో చంద్రబాబు పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు.  2019 ఎన్నికలకు ముందు జగన్ ఎవరూ చేయని విధంగా 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఆ విధంగా చూస్తే పాదయాత్ర విజయం ఈసారి జగన్ని సీఎం ని ఖాయంగా చేస్తుందంటున్నారు.


.
3. అధికార పార్టీ వ్యతిరేకత అంతా జగన్ పార్టీ వైసీపీ వైపు  ఓట్ల సునామీగా టర్న్ అయింది. ఏపీలో పోటీ అంతా టీడీపీ వర్సెస్ వైసీపీగా జరిగింది. అయిదేళ్ళ బాబు పాలన పట్ల విసిగిన జనానికి జగన్ ఒక్కడే  ప్రత్యామ్న్యాయంగా గా కనిపించారు. అందువల్ల జగన్ కి ఓటు వేసి గెలిచిస్తారన్నది బలమైన అంచనా.



4 ఒక్కసారి జగన్. ఈ నినాదం ఈసారి బాగా జనంలోకి వెళ్ళిపోయింది. జగన్ పదేళ్ళుగా కష్టపడుతున్నారు. ఆయన్ని ఎందుకు సీఎం చేయకూడదు. ఇది జనంలో వచ్చిన  పెద్ద మార్పు. పైగా వైఎస్సార్ పధకాలు, బాబు పాలనను పోల్చుకున్న జనానికి మళ్ళీ జగన్ వస్తే పాత పధకాలు వస్తాయన్న ఆశ కూడా ఆయన్ని సీఎం చేస్తుందంటున్నారు.



5 ఇది టీడీపీ యాంటీ సెంటిమెంట్. ఈసారి అంతటా టీడీపీకి వ్యతిరేకత వెల్లువలా కనిపించింది. ఎంతలా అంటే సిట్టింగు ఎమ్మెల్యేలతో సహా అంతా జనాగ్రహానికి గురి అయ్యేలా. పైగా పొత్తులు లేకుండా బాబు ఈసారి పోటీకి దిగుతున్నారు. ఆ యాంటీ సెంటిమెంట్ దెబ్బ టీడీపీకి పడుతోంది. అది వైసీపీని గెలిపిస్తోంది. మొత్తానికి చూసుకుంటే జగన్ ఈసారి గెలిచేందుకు ప్రధాన కారణాలుగా ఇవి ఉన్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: