తెలుగు టీవీ జర్నలిజానికి ఆధ్యునిగా తనదైన ముద్ర వేసుకున రవిప్రకాష్ పేరుకు ముందు టీవీ 9 ట్యాగ్ ఒక్కసారిగా పక్కకుపోయింది. నిజంగా చాల బాధాకరమైన అంశమే. అంతా తానే అయి పెంచి పోషించిన ఓ సంస్థ నుంచి ఇలా అవమానకరమైన తీరులో బయటకు రావడం విశేష పరిణామమే. అయితే రవిప్రకాష్ తాను స్వయంక్రుషితో  ఎదిగి ఇంత ఎత్తుకు ఎలా వచ్చారో అలాగే ఆయన స్వయంక్రుపారాధంతో దిగిపోయారన్న చర్చ కూడా సాగుతోంది.


ఇవన్నీ ఇలా ఉంటే రవిప్రకాష్ ఫ్యూచర్ కోర్స్  ఆఫ్ యాక్షన్ ఏంటి అన్న దాని మీద ఇపుడు మరో చర్చ సాగుతోంది. టీవీ 9 రవిప్రకాష్ కి మోజో టీవీ కూడా ఉంది. అయితే దానికి పెద్దగా సాంకేతిక సంపత్తి లేదు ఎక్విప్మెంట్ కూడా లేదుట. దాంతో రవి ప్రకాష్ చూపు ఇపుడు ఐ న్యూస్ చానల్ మీద ఉందని కధనాలు వస్తున్నాయి. అక్కడ ఫుల్ ఎక్విప్మెంట్, స్టూడియో, ఫుల్ స్టాప్ అన్నీ ఉన్నాయట.


అయితే ఈ చానల్ ఇపుడు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి చేతిలో ఉందిట. ఆయన టీడీపీలో ఉన్నారు. కాబట్టి సులువుగా  డీల్ సెట్ చేసుకుని ఐ న్యూస్ ని టేకోవర్ చేయాలన్నది రవి ప్రకాష్ ఫ్యూచర్ ప్లాన్ గా కనిపిస్తోంది అంటున్నారు. పైగా రవి ప్రకాష్ మనుషులు టీవీ 9 నిండా ఉన్నారు. వారిని కూడా తీసుకువచ్చి టీ 9 ని పోటీగా దీన్ని తయారు చేయాలనుకుంటున్నారని టాక్. చూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: