Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 24, 2019 | Last Updated 7:11 am IST

Menu &Sections

Search

ఇండియాలో టాప్ స్టార్ట‌ప్స్ ఇవే

ఇండియాలో టాప్ స్టార్ట‌ప్స్ ఇవే
ఇండియాలో టాప్ స్టార్ట‌ప్స్ ఇవే
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్ర‌పంచాన్ని ఒంటి చేత్తో శాసిస్తున్న ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ రంగంలో చోటు చేసుకున్న మార్పుల‌కు అనుగుణంగా ఇండియా మారుతోంది. త‌న స్వ‌రూపాన్ని మార్చేసుకుంటోంది. ఇండియాకు చెందిన ఔత్సాహికులు , ఆంట్ర‌ప్రెన్యూర్స్ ఎక్క‌డ‌లేనంత మంది పుట్టుకొచ్చారు. కొత్త ఆలోచ‌న‌ల‌కు రెక్క‌లు తొడుగుతున్నారు. త‌మ‌ను తాము ప్రూవ్ చేసుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. న్యూ థాట్స్..నూ లుక్స్‌..న్యూ డిజైన్స్‌తో తెగ ఆక‌ట్టుకుంటున్నారు. వ్యాపారంలో డ‌బ్బులు ముఖ్యం కాద‌ని..కాస్తంత తెలివి వుంటే చాలు..కాస్తంత న‌డుం వంచి క‌ష్ట‌ప‌డితే..నాణ్య‌వంత‌మైన స‌ర్వీసులు అందజేయ‌గ‌లిగితే కోట్లు వెన‌కేసుకోవ‌చ్చు. తాము ఎదుగుతూ..తాము బ‌తుకుతూ తమ లాంటి వారికి..త‌మ తోటి వారికి లైఫ్ ఇవ్వొచ్చు. ఇటీవ‌ల యువ‌తీ యువ‌కుల్లో ఒక్క‌టే క‌నిపిస్తోంది. తామేమిటో నిరూపించుకునే అవ‌కాశం తాము స్థాపించిన లేదా ప్రారంభించిన దానితోనే సాధ్య‌మ‌వుతుంద‌ని న‌మ్ముతున్నారు. ఇంకొక‌రి ద‌గ్గ‌ర ప‌ని చేసేందుకు ఇష్ట‌ప‌డ‌టం లేదు. స్వంతంగా ఏదైనా తామే స్టార్ట్ చేయాల‌ని త‌పిస్తున్నారు. 


ఆ దిశ‌గా అడుగులు వేస్తున్నారు. ట్రైన‌ర్స్‌తో , అనుభ‌వ‌జ్ఞుల‌తో, మెంటార్స్‌తో ఇలా ఆయా రంగాల‌కు సంబంధించి ఇప్ప‌టికే వ‌జ‌యాలు న‌మోదు చేసుకున్న వారిని తామే క‌లుస్తున్నారు. వారి ఆలోచ‌న‌ల‌తో త‌మ ఆలోచ‌న‌ల‌ను పంచుకుంటున్నారు. భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మేకిన్ ఇండియా పేరుతో కొత్త ప్రోగ్రాంను ఓపెన్ చేశారు. దీని ద్వారా ఇండియాలో ఎక్క‌డ నివ‌శిస్తున్నా స‌రే ..ఏ కులంతో, వ‌ర్గంతో, మ‌తంతో ప‌ని లేదు. నీ ద‌గ్గ‌ర మంచి ఐడియా వుంటే చాలు. చిన్న‌పాటి ప్రాజెక్టు రిపోర్టు త‌యారు చేసుకుని..స్టార్ట‌ప్ ఇండియా సైట్ ద్వారా ఆన్ లైన్లో న‌మోదు చేసుకుంటే ..నిమిషాల్లో మీ మొబైల్‌కు సంక్షిప్త స‌మాచారం వ‌స్తుంది. ఆ త‌ర్వాత ఆయా నిపుణులే మిమ్మ‌ల్ని సంప్ర‌దిస్తారు. మీకో డేట్ ఇస్తారు. మీరు ప్రారంభించ బోయే వ్యాపారం గురించి ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ త‌ర్వాత పెట్టుబ‌డి పెట్టే వాళ్లు మీతోనే వుంటారు. మీ ఐడియా న‌చ్చితే ..ఇంకేం అప్పుడే మీతో ఒప్పందం చేసేసుకుంటారు కూడా. 


మీకు కావాల్సిన ప‌త్రాలు అన్నీ వారే స‌మ‌కూరుస్తారు. మీతో ద‌గ్గ‌రుండి అన్నీ చేయిస్తారు. మీ వ్యాపారాన్ని మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించేలా మిమ్మ‌ల్ని తీర్చిదిద్దుతారు. అవ‌స‌ర‌మైన మేర‌కు శిక్ష‌ణ కూడా ఇస్తారు..కాదంటే ఇప్పిస్తారు. ఆ త‌ర్వాత మార్కెటింగ్ స్కిల్స్..ఎలా నిల‌దొక్కుకోవాలో కూడా నేర్పిస్తారు. స్టార్ట‌ప్‌లు లెక్క‌లేన‌న్ని పుట్టుకు వ‌చ్చాయి. ఇందులో అన్నీ స‌క్సెస్ అవుతున్నాయ‌ని అనుకోడానికి వీలులేదు. కానీ 60 శాతానికి పైగా ప్రారంభించిన త‌ర్వాత నిల‌దొక్కుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. ఇప్ప‌టికే కోట్లాది రూపాయ‌లు విదేశీ కంపెనీలు మ‌న వారి స్టార్ట‌ప్ ల‌లో పెట్టుబ‌డులు పెట్టాయి. ఇది మ‌న‌వాళ్లు సాధించిన విజ‌యం అనుకోవ‌చ్చు. న్యూ ఢిల్లీ, బెంగ‌ళూరు, కోల్‌క‌తా, చెన్నై, హైద‌రాబాద్ త‌దిత‌ర సిటీస్ అన్నీ ఐటీ హ‌బ్స్ గా మారిపోయాయి. న్యూ టెక్నాల‌జీని యూజ్ చేసుకుంటూ డాల‌ర్ల పంట పండిస్తున్నాయి. అలాంటి వాటిలో ఇండియా వ్యాప్తంగా అంకురాల‌ను ప‌రిశీలిస్తే..టాప్‌లో 25 స్టార్ట‌ప్‌లు  ఇలా ఉన్నాయి.


టాప్ వ‌న్ పొజిష‌న్‌లో స్టార్ట‌ప్‌గా బెంగ‌ళూరు కేంద్రంగా నిర్వ‌హిస్తున్న స్టార్ట‌ప్ ఇన్‌స్టా మోజో నిలిచింది. ఈ కామ‌ర్స్ బిజినెస్‌లో ఎంఎస్ఎంఇ బిజినెస్‌లో దూసుకెళుతోంది. రెండో స్థానంలో గూర్గావ్ కు చెందిన స్టార్ట‌ప్ ఇక్సిగో నిలిచింది. ట్రావెల్ రంగంలో ఇదో సంచ‌ల‌నం. ఈ కంపెనీలో 200 మంది ప‌ని చేస్తున్నారు. మూడో స్థానంలో బెంగ‌ళూరు కేంద్రంగా అన్ అకాడెమీ స్టార్ట‌ప్ పొందింది. భార‌త‌దేశంలో ఉచితంగా ఏ కోర్సునైనా నేర్చుకోవ‌చ్చు. ఈ కంపెనీలో 500 మంది ప‌ని చేస్తున్నారు. బ్యూటీ అండ్ వెల్ నెస్ రంగంలో ప్రారంభ‌మైన నైకా స్టార్ట‌ప్ డాల‌ర్లు కొల్ల‌గొడుతోంది. ఇక అయిదో స్థానంలో ష‌ట్ట‌ల్ స్టార్ట‌ప్ చేరుకుంది. డిజిట‌ల్ టెక్నాల‌జీని డెవ‌ల‌ప్ చేస్తుంది. ఆరోవ స్థానంలో ముంబ‌యి కేంద్రంగా ప్రారంభించిన 200 మందికి ఉపాధి నిస్తున్న హాప్టిక్ స్టార్ట‌ప్ చేరుకుంది. మ‌రో స్టార్ట‌ప్ బెంగళూరు కేంద్రంగా ప‌నిచేస్తోంది అదే లోక‌స్. ఈ స్టార్ట‌ప్ ఏడో స్థానంలో ఎంపికైంది. 


ఆహార రంగంలో సంచ‌ల‌నం స్విగ్గి. ఇది బెంగ‌ళూరు కేంద్రంగా ప్రారంభ‌మైన అంకుర సంస్థ‌. కొద్దిమందితో ప్రారంభ‌మైన ఈ స్టార్ట‌ప్ ఇపుడు 5 వేల మందికి ఉపాధి క‌ల్పిస్తోంది. గూర్గావ్ కేంద్రంగా ప్రారంభ‌మైన మ‌రో స్టార్ట‌ప్ ఈజీ డిన్న‌ర్ 200 మందితో న‌డుస్తోంది. ఈ అంకుర సంస్థ తొమ్మిదో స్థానంలో ఉండి పోయింది. క్రాఫ్ట్స్ రంగంలో వినూత్న‌మైన డిజైన్ల‌తో ఆక‌ట్టుకుంటూ ఆదాయాన్ని గ‌డిస్తున్న మ‌రో స్టార్ట‌ప్ ముంబై కేంద్రంగా ఉన్న క్రాఫ్ట్స్ విల్లా ప‌దో స్థానంలో నిలిచింది. ప‌ద‌కొండో స్థానంలో ఫైండ్ స్టార్ట‌ప్. బెంగ‌ళూరు కేంద్రంగా ఉన్న స్మాల్ కేస్ స్టార్ట‌ప్ 12వ స్థానానికి ఎదిగింది. ము్ంబై, హైద్రాబాద్ జంట న‌గ‌రాల్లో ప్రారంభ‌మైన డాక్ట‌ర్ టాక్ స్టార్ట‌ప్ 13వ స్థానం సాధించింది.

స్కై లార్క్ డ్రోన్స్ 14వ స్థానంలో నిలువ‌గా, పోస్ట్‌మ్యాన్ స్టార్ట‌ప్ 15వ స్థానం పొందింది. ముంబై కేంద్రంగా ప్రారంభ‌మైన అంకుర సంస్థ టెక్ట్స్ బుక్ ప‌ద‌హారో స్థానంలో నిలిచింది. 17వ స్థానంలో నానో నెట్స్ స్టార్ట‌ప్ ఉండ‌గా, 18వ స్థానంలో లాజినెక్ట్స్ సాధిస్తే..19వ స్థానంలో రైతుల‌కు ఉప‌యోగ‌ప‌డేందుకు ప్రారంభించిన స్టార్ట‌ప్ కిసాన్ నెట్ వ‌ర్క్ నిలిచింది. మ‌రో వైపు 20 వ స్థానం పొందితే, 21వ స్థానంలో హైప‌ర్ ట్రాక్ ఉంటే..22వ స్థానంలో ద మామ్స్ స్టార్ట‌ప్ చేరుకుంది. 23వ స్థానంలో మొబిక్విక్ అంకుర సంస్థ నిలువ‌గా , 24వ స్థానంలో జంగిల్ గేమ్స్ చేరుకుంది. 25వ స్థానంలో వెర్నాక్యూల‌ర్ స్టార్ట‌ప్ పొందింది.


india-startup
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

Sujatha is a full-time Sustainability Consultant and works on mainstreaming ESG risk in the Finance and Retail sectors with a view on specific commodities. When she isn't working Sujatha struggles through a contested divorce petition, drinks Tea depending on the time of day and comments on the many goof-ups of life, love, religion, the system, et al. She writes often, but not regularly and is currently working on her own book.