ఏపీలో జగన్ అధికారంలోకి వస్తే ఏదో జరిగిపోతుందని 2014 ఎన్నికల ముందు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇపుడు మరో మారు కూడా జరిగింది. జగన్ తండ్రి వైఎస్సార్ అయిదేళ్ళ పాలన చూసిన తరువాత కూడా ఏపీలో జగన్ వస్తే అరాచకం చేస్తారని చెప్పడం దిగజారిన రాజకీయం తప్ప మరేమీ కాదు. అయితే జనం మాత్రం జగన్ విషయంలో ఒక్కసారి చాన్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని, అధి ఈవీఎంలలో ఉందని సర్వేలన్నీ గట్టిగానే చెబుతున్నాయి. 


ఈ నేపధ్యంలో ఏపీలో టీడీపీ, జనసేనలల్లో కొత్త గుబులు బయల్దేరింది. జగన్ అధికారంలోకి వస్తే  తమ ఎమ్మెల్యేలను లాగేస్తారేమోన్నన్న కంగారు వారిని పట్టి పీడిస్తోంది. అయితే జగన్ మాత్రం ఈ విషయంలో మొదటి నుంచి ఒకే మాట మీద ఉన్నారు. తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీ తీసుకున్నపుడు వారిని పదవులకు రాజీనామా చేయామని డిమాండ్ చేశారు. ఇపుడు కూడా వైసీపీలో చేరడానికి అనేకమంది టీడీపీ నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు.


అయితే వారికి మాత్రం జగన్ గట్టి కండిషన్లు పెడుతున్నారు. ఎవరైనా తమ పార్టీలోకి చేరవచ్చు. కానీ వారు పార్టీకి రాజీనామా  చేసిన మీదటనే రావాలి. అలాగే పదవులు కూడా వదులుకోవాలి. ఇది జగన్ కండిషన్. మరి ఈ కండిషన్లు టీడీపీ నుంచి ఇటు వైపు జంప్ చేద్దామనుకుంటున్న వారికి శాపాలుగా మారుతాయనడంలో సందేహం లేదు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలుగా నెగ్గిన వారు రాజీనామా చేయమంటే సులువుగా  చేయరు


వారు చేయకపోతే జగన్ చేర్చుకోరు. అందువల్ల రేపు జగన్ అధికారంలోకి వస్తే తమ ఎమ్మెల్యేలను గుంజుకుపోతారన్న భయం బాబుకు ఇటు పవన్ కి అసలు ఉండనవసరం లేదని అంటున్నారు.  ఇప్పటికే చంద్రబాబు పార్టీ  రివ్యూ మీటింగుల్లో మాట్లాడుతూ తమ ఎమ్మెల్యేలకు వైసీపీ  ట్రాప్ చేస్తోందని ఆరోపించారు. కానీ జగన్ అలా చేయడని వైసీపీ నేతలు భరోసా ఇస్తున్నారు. సో జగన్ అభయం దక్కినట్లే.
 



మరింత సమాచారం తెలుసుకోండి: