వైఎస్ జగన్ మాట విని, ఆయన్ని చూసి ఏపీ జనాలకు దాదాపుగా నెలరోజులైపోతోంది. జగన్ గత నెల 11న పోలింగ్ సందర్భంగా తమ పార్టీ గెలుస్తుందని మీడియాతో మాట్లాడారు. ఆ తరువాత రెండు రోజులకు గవర్నర్ కి ఓ విన్నపం చేస్తూ మళ్ళీ కనిపించారు. అంతే జగన్ అప్పటినుంచి ఇప్పటివరకూ  జనంలోకి వచ్చింది లేదు. దీని మీద తెలుగుదేశం పార్టీ హాట్ కామెంట్స్ చేస్తోంది కూడా. జగన్ కి అధికారం మాత్రమే కావాలి తప్ప జనం సమస్యలు పట్టవని కువిమర్శలు చేస్తున్నారు. అయితే ఎన్నికలు అయిపోయాయి. కోడ్ అమల్లో ఉంది. ఇపుడు రాజకీయం ఏం చేయాలి అన్నది వైసీపీ మాటగా  ఉంది.


వీటికి ఫుల్ స్టాప్ పెట్టేలా జగన్ మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. పోలింగ్ తరువాత ఆయన విశ్రాంతి తీసుకున్నారు. ఇపుడిపుడే మళ్ళీ పార్టీని గేరప్ చేస్తున్నారు. కౌంటింగునకు డేట్ దగ్గర పడుతున్న టైంలో జగన్ పార్టీ శ్రేణులను కూడా అలెర్ట్  చేస్తున్నారు. అందులో భాగంగా జగన్ రేపు తన సొంత జిల్లా కడప పర్యటన పెట్టుకున్నారు. పులివెందులలో జగన్ ఒక రోజు పర్యటన ఉందని తెలుస్తోంది. ఈ సంధర్భంగా ప్రజల సమస్యలపైన కూడా అయన ద్రుష్టి సారిస్తారని అంటున్నారు.


అదే విధంగా ఈ నెల 15, 16 తేదీల్లో జగన్ విజయవాడ వేదికగా ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. దాంతో జగన్ మళ్ళీ జనంలోకి వస్తున్నారని, దానికి గ్రాండ్ ఎంట్రీగా ఇది భావించాలి. ఇక జగన్ తమ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధులతో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తారని అంటున్నారు. ఈ మీటింగ్ ద్వారా పోలింగ్ సరళి ఎలా ఉంది అన్నది తెలుసుకుంటారని అంటున్నారు. మొత్తానికి జగన్ మళ్ళీ యాక్టివ్ కావడంతో ఏపీ రాజకీయాల్లో కొత్త వూపు ఉత్సాహం కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: