అశోక్‌..ఈ పేరు తెలియ‌దేమో కానీ ఐటీ గ్రిడ్ అశోక్ అంటే వెంట‌నే గుర్తుకు వ‌స్తుంది. కోటి అనే వ్య‌క్తిని కూడా గుర్తుపట్ట‌డం క‌ష్టం....కానీ దివంగ‌త ఎన్టీఆర్ భార్య ల‌క్ష్మీపార్వ‌తిపై లైంగిక ఆరోప‌ణ‌లు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన కోటి అంటే ఆయ‌నెవ‌రో తెలుస్తుంది. శివాజీ అంటే కూడా ఆయ‌నెవ‌రు అనే ప్ర‌శ్న వ‌స్తుంది. అయితే, గ‌రుడ పురాణం శివాజీ, ఏపీ సీఎం చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా మాట్లాడే శివాజీ అంటే ట‌క్కున ఆయ‌న వివ‌రాలు మ‌న‌కు గుర్తుకు వ‌స్తాయి. ఇక ర‌వి ప్ర‌కాష్‌...టీవీ9 మాజీ సీఈఓ అయిన ర‌వి గురించి కొత్తగా ప‌రిచ‌యం అవ‌సరం లేదు.


వీళ్లంతా...ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నారు. పోలీసు భాష‌లో చెప్పాలంటే...ప‌రారీలో ఉన్న నిందితులు. వివిధ కేసుల్లో వీరిపై అభియోగాలు న‌మోదు అయ్యాయి. వీరి వివ‌ర‌ణ తీసుకునేందుకు లేదా వీరిపై వ‌చ్చిన అభియోగాల్లో వాస్త‌వం తేల్చేందుకు పోలీసులు ప్ర‌యత్నిస్తున్నారు. కానీ వీరి జాడ తెలియ‌డం లేదు. దీంతో వీళ్ల‌ను ఎవ‌రు దాచారు..ఎక్క‌డ దాచారు బాబు అంటూ ప‌లువురు చెవులు కొరుక్కుంటున్నారు.


ఐటీ గ్రిడ్స్ అశోక్ అయితే...దాదాపుగా నాలుగు నెల‌లుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఓ పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించి డాటా చౌర్యం చేశార‌నే సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్నారు. ఆయ‌న ఆచూకి కోసం గాలిస్తున్నా జాడ దొర‌క‌పోవ‌డం వెనుక‌...ఓ ప్ర‌ముఖుడి హ‌స్తం ఉందంటున్నారు. త‌న‌కు మేలు చేసిన అశోక్ ఇబ్బందుల పాలు కావ‌ద్ద‌నే ఆయ‌న అశోక్‌ను దాస్తున్నార‌ని చెప్తున్నారు. అదే రీతిలో..కోటి, శివాజీ, ర‌విప్ర‌కాష్ సైతం ఆశ్ర‌యం పొందుతున్న‌ట్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వార్త‌ల్లో నిజ‌మెంతో తేలాలంటే...ఈ న‌లుగురిలో ఎవ‌రో ఒక‌రు బ‌య‌ట‌కు రావాల్సిందే


మరింత సమాచారం తెలుసుకోండి: