తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు త‌న త‌మిళ‌నాడు పర్య‌ట‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ఫెడరల్‌ఫ్రంట్ ఏర్పాటులో ప్రాంతీయపార్టీల మద్దతు కూడగట్టేందుకు రాష్ర్టాల పర్యటనలు చేపడుతున్న కేసీఆర్ ఈ దిశగా ఇప్పటికే పలువురు నేతలతో సమావేశమైన కేసీఆర్ డీఎంకే అధినేత స్టాలిన్‌తో సమావేశం కానున్నారు. ఈ భేటీ కోసం ఆదివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో చెన్నై బయలుదేరివెళ్లారు. కేసీఆర్ వెంట పలువురు టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.


ఆదివారం తమిళనాడు పర్యటనకు బయల్దేరిన సీఎం కేసీఆర్... శ్రీరంగం చేరుకున్నారు. ఇవాళ శ్రీరంగనాథ స్వామిని దర్శించుకోనున్న సీఎం కేసీఆర్... ఇవాళ మధ్యాహ్నం తర్వాత చెన్నై వెళ్లి సాయంత్రం 4.30 గంటలకు డీఎంకే అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్‌తో ఆయన నివాసంలో సమావేశం కానున్నారు. ఫెడరల్ ఫ్రంట్, రాజకీయ పరిణామాలు, ప్రాంతీయ పార్టీల సన్నద్ధత తదితర అంశాలపై కేసీఆర్.. స్టాలిన్‌తో చర్చించనున్నట్లు సమాచారం.


ఈ నెల 23 తరువాత కేంద్రంలో ఏర్పాటుకాబోయే ప్రభుత్వంలో ప్రాంతీయపార్టీలు కీలకపాత్ర పోషించాలని.. ప్రాంతీయపార్టీల వద్దకే జాతీయపార్టీలు వచ్చేలా అందరం కలిసి ముందుకువెళ్దామని ఈ సందర్భంగా కేసీఆర్ డీఎంకే అధినేతకు వివరించనున్నారు. కేంద్రం లో ఏ జాతీయపార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ రాదని, ప్రాంతీయపార్టీలు సాధించే స్థానాలే కీలకం కానున్నాయని తెలుపనున్నారు. ప్రాంతీయపార్టీలతో ఏర్పాటయ్యే కూటమి ద్వారా కేంద్రప్రభుత్వంలో కీలకపాత్ర పోషించి.. రాష్ట్రాలకు అధికారాల బదలాయింపు, అధికార వికేంద్రీకరణ సాధించాలని చెప్పనున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: