రాష్ట్ర ప్రభుత్వంలో  ఇంతకాలం ఉప్పు-నిప్పులాగున్న ఇద్దరు పెద్ద తలకాయల మధ్య భేటీ జరగబోతోంది. వారిద్దరే చంద్రబాబునాయుడు, ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్యాబినెట్ సమావేశం జరుగుతుందా ? జరగదా ? అని అందరూ ఎదురుచూస్తున్న నేపధ్యంలో హఠాత్తుగా చంద్రబాబుతో ఎల్వీ భేటీ అవటంపై అందరిలోను టెన్షన్ పెరిగిపోతోంది.

 

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో క్యాబినెట్ సమావేశం పెట్టకూడదన్న నిబంధన తెలిసీ చంద్రబాబు సమావేశం కోసం పట్టుబట్టారు. సరే తర్వాత జరిగిన పరిణామాలన్నీ అందరికీ తెలిసిందే. 14వ తేదీన క్యాబినెట్ సమావేశం జరగాలంటే కేంద్ర ఎన్నికల కమీషన్ అనుమతించాలి. లేకపోతే చంద్రబాబు పరువు గోవిందానే.

 

మంగళవారం క్యాబినెట్ సమావేశం జరగాలంటే సోమవారం సాయంత్రంలోగా అనుమతి రావాలి. అనుమతే వస్తుందా లేదా అన్న విషయంపైనే ఇటు టిడిపి వర్గాలతో పాటు అటు అధికారయంత్రాంగమంతా టెన్షన్ తో ఎదురు చూస్తోంది. ఈ నేపధ్యంలోనే చంద్రబాబును కలవటానికి ఎల్వీ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.

 

చంద్రబాబును ఎల్వీ కలవటానికి కారణాలేముంటాయనే విషయంలో ఎవరికి వారుగా ఊహించుకుంటున్నారు. ఎందుకంటే, సిఎస్ గా బాధ్యతలు తీసుకోగానే ఎల్వీ మర్యాదపూర్వకంగా చంద్రబాబును కలిశారు. అయితే అటువంటి మర్యాదలేవీ పాటించని చంద్రబాబు అప్పుడే ఎల్వీపై నోరుపారేసుకున్నారు. ఆ తర్వాత నుండి ఎల్వీ మళ్ళీ చంద్రబాబును కలవలేదు.

 

క్యాబినెట్ మీటింగ్ జరిగే విషయంలో చంద్రబాబును ఎల్వీ కలిశారంటే కేంద్ర ఎన్నికల కమీషన్ అనుమతి ఇవ్వలేదా ? అనే అనుమానాలు మొదలయ్యాయి. ఆ విషయాన్ని నేరుగా చంద్రబాబు కలిసి బ్రీఫ్ చేద్దామనే ఎల్వీ కలిశారా అనే ప్రచారం ఊపందుకుంది. ఏదేమైనా పంతానికి పోయి చంద్రబాబు అనవసరంగా చెత్తనేసుకున్నారే అనుకుంటున్నారు.

 

 

 

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: