అత్యధిక విద్యావంతులను పోటీకి నిలబెట్టిన రాజకీయ పార్టీల్లో వైసిపినే నెంబర్ 1గా నిలిచింది. 2019 ఎన్నికల్లో వివిధ పార్టీల తరపున పోటీ చేసిన విద్యావంతులపై ఇండియా టు డే ఓ సర్వే చేసింది. ఆ సర్వేలో వైసిపిదే మొదటిస్ధానంగా తేలింది. దేశం మొత్తం మీద వివిధ పార్టీల తరపున పోటీ చేసిన వారిలో డిగ్రీ విద్యార్హత కలిగిన వారు 48 శాతం మందేనట.

 

అత్యధికంగా ఉన్నత విద్యా వంతులను పోటీ చేయించిన ఘనత మాత్రం వైసిపిదే. ఈ పార్టీ తరపున డిగ్రీ ఆపై విద్యార్ధతలున్న వారు ఏకంగా 88 శాతం మందున్నట్లు సర్వేలో తేలింది.  వైసిపి తరపున పోటి చేసిన లోక్ సభ అభ్యర్ధుల్లో డాక్టర్లు, లాయర్లు, బిజినెస్ మేనేజ్మెంట్ చదివిని వాళ్ళున్నారు. దాదాపు 14 మంది డాక్టర్లకు వైసిపి టికెట్లివ్వటం గొప్పే.

 

వైసిపి తరవాత స్ధానంలో తమిళనాడులోని ఏఐఏడిఎంకె 86.4 శాతం, టిఆర్ఎస్ పార్టీ తరపున 82.4 శాతం మందున్నారు. తమిళనాడుకే చెందిన నామ్ తమిళియార్ కట్చి తరపున 80 శాతం మంది ఉన్నత విద్యావంతులున్నారట. కాంగ్రెస్ తరపున 75.7 శాతం, టిఎంసి తరపున 74.5 శాతం, ఓడిస్సాలోని బిజు జనతాదళ్ తరపున 71.4 శాతం ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో నిరక్షరాస్యులు కూడా 2 శాతం ఉన్నారు లేండి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: