ఈ నెల 19న చివరి విడత ఎన్నికలు ముగిసాక వెల్లువలా ఎగ్టిట్ పోల్స్ వస్తాయన్న  సంగతి తెలిసిందే. అందులో కొన్ని ప్రాంతీయం, మరికొన్ని జాతీయం ఇలా అన్ని రకాల సర్వేలు ఏ పార్టీ గెలుస్తుందో చూచాయగా చెప్పేస్తాయి. అంటే ఓ విధంగా అసలు ఫలితాల కంటే వీటి మీద జనాలకు ఆసక్తి బాగా పెరిగిపోతోంది. 


ఈ విషయం గమనించి  ముందుగానే పార్టీ శ్రేణులకు చంద్రబాబు అలెర్ట్ చేస్తున్నారట. ధైర్యం కూడా నూరిపోతున్నారుట. ఎగ్టిట్ పోల్ సర్వేలు వైసీపీ గెలుస్తాయని చెబుతున్నాయి. ఎవరూ కంగారు పడవద్దు, అధైర్యపడవద్దు, అవన్నీ పట్టించుకోవద్దు. అసలు పోల్స్ మనకే అనుకూలమని బాబు అంటున్నట్లుగా భోగట్టా. నిన్న చివరి సారిగా జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం చంద్రబాబు మంత్రులతొ చిట్ చాట్ పెట్టారు. ఈ సందర్భంగా ఎగ్టిట్ పోల్స్ పై చర్చ వచ్చింది.


దీని మీద బాబు మంత్రులతో ఈ మాటలన్నారట. ధైర్యం పోగొట్టుకోవద్దు, మనమే గెలుస్తున్నామని చెప్పుకొస్తున్నారుట. ఇక మంత్రి ఆదినారాయణరెడ్డి ఆర్టీజీఎస్ తుపాను గురించి చెప్పినట్లుగా ఓట్ల సునామీ గురించి చెప్పదా అంటూ పంచ్ డైలాగ్ పేల్చారట. చెబుతుంది నీ చెవిలో అంటూ దానికి సీఎం బాబు కౌంటరేశారట. మొత్తానికి మంత్రులకు ప్రజా తీర్పుపై ఓ విధమైన భయం పట్టుకుంటే చంద్రబాబు సైతం సర్వేలు అన్నీ వైసీపీకే అనడం కొసమెరుపు.


మరింత సమాచారం తెలుసుకోండి: