రాజగురువు రామోజీరావుతో చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. వీరిభేటీ హఠాత్తుగా నిర్ణయమైనట్లు సమాచారం. భేటీ కోసమే చంద్రబాబు అమరావతి నుండి హైదరాబాద్ చేరుకున్నారు. జూబ్లిహిల్స్ లోని తన నివాసం నుండి రామోజీ ఫిల్మ్ సిటీకి ప్రత్యేక హెలికాప్టర్లో  వెళ్ళారు. ఒకవైపు టిడిపి ఓడిపోతోందని ప్రచారం, మరోవైపు కేంద్రంలో మళ్ళీ నరేంద్రమోడినే ప్రధాని అవుతారనే ప్రచారం అందరికీ తెలిసిందే.

 

జరుగుతున్న ప్రచారం ప్రకారం రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చి కేంద్రంలో మళ్ళీ మోడినే ప్రధాని అయితే చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు చాలా దుర్భరంగా ఉంటుందనటంలో సందేహం లేదు. ఎందుకంటే, గడచిన ఐదేళ్ళుగా అన్నీ రకాలుగా చంద్రబాబు కావచ్చు లేదా మంత్రులు, టిడిపి నేతలు కావచ్చు జగన్మోహన్ రెడ్డిపై  అంతలా మానసికంగా దాడులు చేశారు.

 

జగన్ సిఎం అయితే వ్యక్తిగతంగా తనకు, కొడుకు లోకేష్ తో పాటు పలువురు మంత్రులు, నేతలకు ఇబ్బందులు తప్పవని చంద్రబాబులో ఆందోళన పెరిగిపోతున్నట్లుంది. ఒకవేళ టిడిపి ఓడిపోతే భవిష్యత్ రాజకీయాల్లో ఎటువంటి పాత్ర పోషించాలనే విషయంలో సూచనలు, సలహాలు తీసుకునేందుకే చంద్రబాబు ఫిల్మ్ సిటీకి వెళ్ళినట్లు ప్రచారం జరుగుతోంది.

రామోజీకి బిజెపిలోని అగ్రనేతల్లో కొందరితో సన్నిహిత సంబంధాలున్నాయన్న విషయం అందిరికీ తెలిసిందే. రేపైదైనా సమస్య వస్తే రామోజీ పరిచయాలను అడ్డంపెట్టుకుని సమస్యలను అధిగమించే ఉద్దేశ్యంతో భేటీకి వెళ్ళినట్లు సమాచారం. టిడిపినే అధికారంలోకి వస్తుందని అంటారు. ఒకసారేమో పార్టీకి 150 సీట్లు గ్యారెంటీ అని, మరోసారి 110 సీట్లలో గెలుపు ఖాయమని, ఎగ్జిట్ పోల్స్ ను నమ్మవద్దని చెప్పటంతో మంత్రులు, నేతల్లో గందరగోళం పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలోనే రామోజీతో భేటీకి ప్రాధాన్యత పెరిగిపోయింది.

 

 

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: