Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, May 26, 2019 | Last Updated 10:39 pm IST

Menu &Sections

Search

ఎడిటోరియల్ : ఏపీ భవిష్యత్తు రాజకీయం..జగన్ Vs పవన్ మాత్రమేనా....టీడీపీ క్లోజ్ కానుందా...?

ఎడిటోరియల్ : ఏపీ  భవిష్యత్తు రాజకీయం..జగన్ Vs పవన్ మాత్రమేనా....టీడీపీ క్లోజ్ కానుందా...?
ఎడిటోరియల్ : ఏపీ భవిష్యత్తు రాజకీయం..జగన్ Vs పవన్ మాత్రమేనా....టీడీపీ క్లోజ్ కానుందా...?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఏపీ భవిష్యత్తు రాజకీయం రాజకీయం  వైసీపీ, జనసేనల మధ్యే నడుస్తుందా...టీడీపీ 2024 కల్లా ఉనికి కోల్పోనుందా...చంద్రబాబు రాజకీయాల  నుంచి విరమించుకుంటారా...ప్రస్తుత రాజకీయ పరిణామాలను పట్టి నిజమే అనిపిస్తుంది. మే 23 న ఏపీ అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దాదాపు జాతీయ ఛానళ్ల సర్వేలు, ప్రముఖ సర్వే సంస్థల ప్రకారం వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో చంద్రబాబు, టీడీపీ మంత్రులు దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, స్థానిక లీడర్ల వరకు తమ రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు తీరు పట్ల తెలుగు తమ్ముళ్లలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. మోదీతో కయ్యం పెట్టుకోవడం, ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడడం , తన కుటుంబసభ్యులకు, సన్నిహితులకు కోట్లాది రూపాయల ప్రజల డబ్బును దోచిపెట్టడం  చంద్రబాబుకు  మైనస్‌గా మారింది. 


మే 23 న వెలువడనున్న ఫలితాల్లో వైసీపీ విజయం ఘన విజయం సాధించి, జగన్ సీఎం అవడం ఖాయమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. పైకి ఘన విజయం సాధిస్తామని చెప్పుకుంటున్నా చంద్రబాబుతో సహా టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలలో ఓటమి తప్పదనే భావన నెలకొంది. చంద్రబాబు ఎన్నికలకు ముందు సంక్షేమ పథకాల పేరుతో పంచిపెట్టిన డబ్బులతో ఓట్లు పడితే టీడీపీ ఈసారి గట్టెక్కుతుంది. అయితే పసుపు కుంకుమ పెద్దగా వర్కవుట్ కాలేదని, పింఛన్ల పెంపు కూడా జగన్ని చూసి కాపీ కొట్టాడని, కేవలం ఓట్ల కోసమే చంద్రబాబు ఈ పథకాలు తీసుకువచ్చాడన్న భావన ప్రజల్లోకి బలంగా వెళ్లింది. పింఛన్ల పెంపు, పసుపు కుంకుమతో కొద్దొ గొప్పొ ఓట్లు పడినా అవి అధికారం సంపాదించిపెట్టేంత కాదని టీడీపీ నాయకులు కూడా అంగీకరిస్తున్నారు. దీంతో మే 23 న వచ్చే ఫలితాల్లో వైసీపీ అధికారం రావడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒక వేళ అందరూ ఊహించినట్లుగా వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ వస్తే ఏపీ రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 


ఇప్పటికే చంద్రబాబు కుటిల రాజకీయాల పట్ల టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. పైకి చెప్పకపోయినా మే 23 తర్వాత చంద్రబాబు నాయకత్వాన్ని వారు ప్రశ్నించే అవకాశం ఉంది. దీనికి తోడు పదవుల కోసం మెజారిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని టాక్.  ఫలితాల తర్వాత వైసీపీ అధికారంలోకి వస్తే  గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు వెంటనే పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. ఈ మేరకు వారు వైసీపీ అగ్రనాయకులతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే చంద్రబాబు ఇమేజ్ పూర్తిగా మసకబారడం ఖాయంగా కనిపిస్తుంది. ఒక వేళ కేంద్రంలో మోదీ మళ్లీ పీఎం అయి, ఏపీలో జగన్ సీఎం అయితే చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్, సన్నిహిత మంత్రుల అవినీతిపై విచారణ జరిగే అవకాశం మెండుగా ఉంది. ఈ దశలో టీడీపీ నాయకులు తమ రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీలో చేరేందుకు రెడీగా ఉన్నారట. మరోవైపు జగన్‌కు అంటే పూర్తిగా వ్యతిరేకించే కొందరు టీడీపీ నాయకులు వైసీపీలో చేరే అవకాశం లేకపోతే..ప్రత్యామ్నాయంగా జనసేనలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారంట. 


చంద్రబాబు‌కు ఏజ్‌ బార్ అయిపోవడం, కొడుకు లోకేష్ నాయకత్వ లక్షణాలపై నమ్మకం లేకపోవడంతో మున్ముందు టీడీపీకి ఫ్యూచర్ ఉండదని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారంట. ఒకసారి జగన్ అధికారంలోకి వస్తే తండ్రి వైయస్ లాగే పాలన అందిస్తాడని, 2024లో కూడా వైసీపీ గెల్చినా ఆశ్చర్యం లేదని టీడీపీ నాయకులు భావిస్తున్నారంట. వచ్చే పదేళ్లు రాజకీయ నిరుద్యోగులుగా ఉండడం కంటే అధికార పార్టీలో చేరితే బెటరని వారు అనుకుంటున్నారంట. అలాగే వైసీపీ అధికారంలోకి వస్తే తండ్రి వైయస్ లాగే జగన్ కూడా టీడీపీని క్షేత్రస్థాయిలో పూర్తిగా బలహీనపరుస్తాడని తెలుగు తమ్ముళ్లు భయపడుతున్నారు. ఈసారి  వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ క్రమేణా పట్టుకోల్పోతుందని, ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ కంటే జనసేనే ఎక్కువగా ప్రభావితం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 


జనసేన తరపున పవన్‌తో పాటు, ఒక 5 గురు ఎమ్మెల్యేలు గెలిస్తే చాలు ప్రతిపక్షంగా జనసేన తనదైన ముద్ర వేస్తుందనడంలో సందేహం లేదు. ఈ ఐదేళ్లలో జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసి, 2024 ఎన్నికల్లో విజయం సాధించడమే టార్గెట్‌గా పవన్ పెట్టుకున్నట్లు సమాచారం. టీడీపీ కంటే వైసీపీతోనే ఇబ్బంది అని భావించిన పవన్ ఈ ఎన్నికల్లో చంద్రబాబు బదులు జగన్నే ఎక్కువగా టార్గెట్ చేసి విమర్శలు చేశాడు. భవిష్యత్తులో టీడీపీ కంటే జనసేన పార్టీనే వైసీపీకి గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంది. మొత్తంగా వైసీపీ అధికారంలోకి వస్తే ఏపీ రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారే అవకాశం ఉంది. చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ క్రమేణా బలహీనపడి, జనసేన ప్రతిపక్షంగా ఎదిగే అవకాశం ఉంది.

2024 లో  వైసీపీ వర్సెస్ జనసేన ల మధ్య ఎన్నికల సమరం జరిగే సూచనలు ఉన్నాయి. అయితే ఇవన్నీ ఈసారి వైసీపీ అధికారంలోకి వస్తే మాత్రమే జరిగే అవకాశం ఉంది. ఒక వేళ టీడీపీ గెలిస్తే ఏపీ రాజకీయం పెద్దగా మార్పులు లేకుండానే నడుస్తుంది. వైసీపీ మరింత పట్టుదలతో పోరాడుతుంది. ఇక జనసేన ఎప్పటిలాగే చంద్రబాబు చాటున ఉండే పార్టీగా మాత్రమే ఉంటుంది. మొత్తంగా మే 23 తర్వాత వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ క్రమేణా బలహీనపడడంతోపాటు, ఏపీ భవిష్యత్తు రాజకీయం వైసీపీ వర్సెస్ జనసేనగా మారే అవకాశం ఉందనడంలో సందేహం లేదు. మరి ఏం జరుగుతుందో చూద్దాం.


ap-election-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

Im interested in writing articles.