ఏపీలో ఎన్నికలు ఓ రేంజిలో జరిగాయని, హోరా హోరీ పోరు టీడీపీ, వైసీపీల మధ్యన ఉందని ఈ రోజు వరకూ కధనాలు వస్తూనే ఉన్నాయి. ఏపీలో టఫ్ ఫైట్ ఉందని, ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీయేనని కూడా రాస్తూ వచ్చ్చారు. ఇక హంగ్ అసెంబ్లీ కూడా రావచ్చునని కూడా లెక్కలు కట్టారు. మరి ఇదంతా ఎందుకోసం. ఎవరి కోసం.


అంటే ఓ మాట వినిపిస్తొదిక్కడ. ఏపీలో టీడీపీకి మద్దతుగా నిలిచే మీడియా నుంచే ఈ వంటకాలు తయారయ్యాయని అంటున్నారు. ఏపీలో పోరు భీకరంగా  ఉందని బిల్డప్ ఇచ్చారని చెబుతున్నారు. పైగా అటు టీడీపీకి కానీ, ఇటు వైసీపీకి కానీ పూర్తి మెజారిటీ రాదని కూడా జోస్యం చెప్పాయి. ఆ విధంగా చేయడంలో గ్రౌండ్ రియాలిటీని మిస్ అయ్యారని అంటున్నారు.


నిజానికి ఏపీ ప్రజలు ఎపుడు హంగ్ అసెంబ్లీని తీసుకురాలేదని చరిత్ర చెబుతోంది. వస్తే ఏ పార్టీకైనా పూర్తి మెజారిటీ దక్కుతుంది. అప్పట్లో కాంగ్రెస్ టీడీపీ అలాగే పోరాడి గెలిచాయి. ఇపుడు వైసీపీ, చంద్రబాబుల మధ్య పోటీ కూడా అలాగే ఉంది. అయితే ఈసారి జగన్ కి అనుకూలంగా ఓ ప్రభంజనం వెల్లువలా  వచ్చిందని అంటున్నారు. 


దీన్ని జాతీయ మీడియా గుర్తించినంతగా ప్రాంతీయ మీడియా అంచనా కట్టలేదని, తెలిసినా కూడా టీడీపీ ప్రయోజనాలు కాపాడేందుకే ఇలా చేశారని అంటున్నారు. అచ్చం మహా కూటమి విజయం అంటూ తెలంగాణా ఎన్నికల్లో చేసినట్లుగా చేశారని అంటున్నారు. ఈ విషయం ముందు  ఎగ్జిట్ పోల్ తో, ఆ తరువాత 23న ఎన్నికల ఫలితాల్లో వెల్లడి అవుతుందని అంటున్నారు. చూడాలి మరి ఏ మీడియా గెలిచిందో.


మరింత సమాచారం తెలుసుకోండి: