జ‌మ్మూకాశ్మీర్‌లో ఉగ్ర‌వాదుల ఏరివేత కొన‌సాగుతోంది. ఈమేర‌కు ముగ్గురు ఉగ్ర‌వాదుల‌ను ఎన్‌కౌంట‌ర్‌లో భ‌ద్ర‌తా సిబ్బంది మ‌ట్టుబెట్టారు.  ఈ నేప‌థ్యంలో ఎన్‌కౌంట‌ర్ లో జ‌ర‌గిన ఎదురుకాల్పుల్లో ఒక జ‌వాను అమ‌రుల‌య్యారు. 


కాగా.. పుల్వామాలోని ద‌లిపొరాలో ఉగ్ర‌వాదుల సంచారం ఉంద‌న్న ప‌క్క స‌మాచారంతో అందుకుంది ఆర్మీ. దీంతో రాష్ట్రీయ రైఫిల్స్‌, సీఆర్పీఎఫ్‌, రాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌ బలగాలు క‌లిసి ద‌లిపొరాలో నిర్బంద త‌నిఖీలు చేప‌ట్టాయి. 


ఈ నేప‌థ్యంలో భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌ను గమ‌నించిన ముష్క‌రులు ఒక్క‌సారిగా వారిపై కాల్పులు జ‌రిపారు. దీంతో ఎదురు కాల్పులు జ‌రిపిన సైన్యం ముగ్గురు ఉగ్ర‌వాదుల‌ను హ‌త‌మార్చారు. 


అయితే.. కాల్పుల జ‌రుగుతున్న స‌మ‌యంలో మ‌రికొంద‌రు ఉగ్ర‌వాదులు అక్క‌డ‌నుంచి పారిపోయారు. దీంతో పారిపోయి వారి కోసం ముమ్మ‌ర గాలింపు చేప‌ట్టారు. ఈ సందర్భంగా ఘ‌ట‌నా స్థ‌లంలో భారీగా ఆయుధాల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు. 


ఇక ఉగ్ర‌వాదుల కాల్పుల్లో ఒక జ‌వాను వీర‌మ‌ర‌ణం పొందారు. మ‌రోవైపు ఎన్‌కౌంట‌ర్ నేప‌థ్యంలో ఎలాంటి హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ఉండేందుకు పుల్వామాలో ఇంట‌ర్నెట్ సేవ‌లు టెంప‌ర‌రీగా నిలిపి వేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: