కడప అంటే వైఎస్ కుటుంబం. అంతలా ఆ కుటుంబాన్ని ప్రేమించే జిల్లా, ఇక పులివెందుల దాదాపుగా నాలుగు దశాబ్దాలుగా ఆ ఫ్యామిలీ చేతుల్లోనే ఉంది. వైఎస్సార్, ఆయన తమ్ముడు వివేకానందరెడ్డి, పురుషోత్తమరెడ్డి, వైఎస్ విజయమ్మ, జగన్ ఇలా ఒకే కుటుంబం 1978 నుంచి పులివెందుల ఎమ్మెల్యేలుగా రాజ్యం చేస్తున్నారు. ఈసారి జగన్ ముఖ్యమంత్రి అవుతారని భావిస్తున్నారు. దాంతో పులివెందుల మెజారిటీ లక్షకు చేరువ అవుతుందని అంటున్నారు.


ఈ నేపధ్యంలో జగన్ రెండు రోజుల పాటుపులివెందులలో నిర్వహించిన ప్రజా దర్బార్ కి జనం పోటెత్తారు. ఎక్కడ చూసిన జనం, ఎక్కడ విన్న జగన్నామ స్మరణం ఇలా పులివెందుల సందడిగా మారింది. వచ్చిన జనాన్ని చూసిన వారికి ఒక్క విషయం అర్ధమవుతుంది. రాయలసీమ గాలి ఈసారి పూర్తిగా ఎటువైపు ఉందో తెలిసిపోయింది.  కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరులతో పాటు, నెల్లూరు, ప్రకాశం ఈ ఆరు జిల్లాల్లో వైసీపీ ప్రభంజనం  వీచిందని తొంబై శాతం సీట్లు జగన్ గెలుచుకుంటారని అంటున్నారు.


ఇక పులివెందుల ప్రజా దర్బార్ కాబోయే సీఎం జగన్ అంటూ గొంతెత్తి చాటింది. జగన్ సైతం వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరిస్తూ మన ప్రభుత్వం వస్తే అన్ని రకాల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. జగన్ ఓపికగా ఉదయం నుంచి రాత్రి వరకూ ఇలా జనంతో మమేకం కావడం నిజంగా గొప్ప విషయంగా పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల ఫలితాలపై ఏపీ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూసున్నారు. ఎపుడెపుడా అని వారంతా ఉబలాటపడుతున్నారు. జగన్ ముఖ్యమంత్రి అని రాయలసీమ చాటేసిన వేళ ఫలితాలు అదే నిజం చెబుతాయేమో.



మరింత సమాచారం తెలుసుకోండి: