ఎల్వీ సుబ్రహ్మణ్యం సీఎస్ గా బాధ్యతలు తీసుకోని చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. సీనియర్ ఐఏఎస్ అధికారి అని గానీ - సీఎస్ గా ఉన్న అధికారి అని గానీ చూడకుండా ఎల్వీపై అవినీతి కేసులున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేనా అసలు ఎల్వీ లాంటి అధికారికి సీఎస్ గా ఎలా అవకాశం ఇస్తారంటూ కూడా బాబు మరింత సంచలన కామెంట్లు సంధించారు. వెరసి చంద్రబాబు - ఎల్వీల మధ్య చాలా దూరం పెరిగింది.


అయితే పోలింగ్ కు - కౌంటింగ్ కు ఏకంగా నెలన్నర సమయం ఉన్న నేపథ్యంలో పాలన ఎలా అన్న రీతిలో ఆలోచించిన బాబు... సమీక్షల పేరిట రంగంలోకి దిగగా... అధికారులెవరూ అటు వైపు చూడకుండా ఎల్వీ చక్రం తిప్పారు. ఈ నేపథ్యంలో అధికారులతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని భావించిన చంద్రబాబు... ఎల్వీని మచ్చిక చేసుకోవడం ఎలాగంటూ ఆరాలు తీశారు. ఇదే సమయంలో తానున్నానంటూ చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ రంగంలోకి దిగారట.


ఇదే విషయంపై ఎల్వీ వద్ద ఎలా వ్యవహరించాలన్న కోణంలో తండ్రి వద్ద తర్ఫీదు తీసుకున్న లోకేశ్... ఎల్వీ వద్దకు చాలా  సార్లు వెళ్లారట. ఈ వంద సార్లు లోకేశ్ తో భేటీకి ఎల్వీ ఎన్నిసార్లు అనుమతి ఇచ్చారో తెలియదు గానీ... ఓ సీఎం కొడుకు - మంత్రి హోదాలో ఉండి తనతో సంధి కోసం వంద సార్లు వస్తే కూడా కనికరించకపోతే ఎలాగన్న రీతిలో ఎల్వీ చంద్రబాబుతో సయోధ్యకు సరేనన్నారట.ఈ క్రమంలోనే మొన్నటి కేబినెట్ భేటీలో చంద్రబాబుతో ఎల్వీ చాలా సఖ్యతగా ఉన్నట్లే కనిపించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: