నిశ్శబ్ద విప్లవం ఉంది. అది మాకే ప్లస్  అయింది ఏపీలో పోలింగ్ పూర్తి అయ్యాక ప్రతీ రాజకీయ పార్టీ చెప్పుకుంటూ వచ్చింది. చిత్రమేంటంటే అధికార పక్షం టీడీపీ కూడా ఈ విప్లవానే నమ్ముకుంది. అసలు విప్లవం ఎపుడు వస్తుంది. ఏలిన వారి తీరు సరిగ్గా లేకపోతే వారి  మీదనే అది వస్తుంది. ఈ లాజిక్ కూడా మిస్ అయి మరీ తమ్ముళ్ళు నిశ్శబ్ద విప్లవం అంటూ గొంతు చించుకుంటున్నారు.


సరే ఆ సైలెంట్ వేవ్ అనబడే విప్లవం ఎవరి వైపు ఉందో చెప్పేందుకు అయిదు రోజులు ఆగనక్కరలేదు. ఒక్క రోజు ఆగితే ఛాలు ఎగ్టిట్ పోల్ సర్వే అసలు గుట్టు బయటేస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లెషకులు. ఎవౌ ఎటూ అన్నది కూడా ఎగ్టిట్ పోల్ సర్వే చాలా వరకూ బయటపెడుతుందని అంటున్నారు. ఏపీలో ఈసారి నిజంగా ఎన్నికలు ఓ పధ్ధతిలో జరిగాయి. పోటా పోటీగా ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లుగానే ఎనభై శాతం వరకూ పోలింగ్ జరిగింది.


అది ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకత అని వైసీపీ అంటోంది. ఇప్పటివరకూ ఎక్కువ శాతం పోలింగ్ జరిగితే అది విపక్షానికే ప్లస్ అయింది. మరి ఆ విధంగా చూసుకుంటే వైసీపీకే లాభం. అయితే మా సర్కారే మరో మారు రావాలని కోరిక మీదనే అర్ధరాత్రి వరకూ జనం వేచి ఉండి మరీ ఓటు వేశారని టీడీపీ అంటోంది. ఉన్న సర్కార్ ని నిలబెట్టాలని విప్లవం తెచ్చారన్నది సైకిల్ పార్టీ  వాదన. అలాగే కొత్త పార్టీ మార్పు తెచ్చే పార్టీ కాబట్టి జనసేనకు ఓటు వేయాలని జనం తహతహలాడి మరీ క్యూలు కట్టారని ఆ విధంగా చూసుకుంటే భారీ  పోలింగ్ మకే లాభం అని జనసేన అంటోంది.


ఆ పార్టీ కూడా సైలెంట్ వేవ్ మీద గంపెడు ఆశలు పెట్టుకుంది. మరి ఈ సైలెంట్ వేవ్ ఏ పార్టీ వైపు సునామీలా దూసుకు వచ్చిందో ఒక్క రోజు ఆగితే ముందు ఎగ్టిట్ పోల్ సర్వే ద్వారా ఆ తరువాత 23న పూర్తిగా అధికార ఫలితాల ద్వారా తెలి సేసుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: